లాక్ డౌన్ దెబ్బకు సినిమా ఇండస్ట్రీ చాలా నష్టపోయింది. సరైన సీజన్లో కరోనావైరస్ రూపంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో కొన్ని కోట్ల వ్యాపారం ఆగిపోయింది. లాక్ డౌన్ ఎఫెక్ట్ కి జరగాల్సిన సినిమా షూటింగులు, సినిమా థియేటర్లు క్లోజ్ అయిపోయాయి. ఈ పరిణామంతో సినిమా ఇండస్ట్రీ పై ఆధారపడిన కుటుంబాలన్నీ అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. లాక్ డౌన్ వలన సినిమా ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్లు తీవ్ర స్థాయిలో నష్టాలు అనుభవిస్తున్నారు. ఇదిలా ఉండగా త్వరలో సినిమా థియేటర్లు మరియు సినిమా షూటింగులు జరుపుకోవడానికి ప్రభుత్వాల నుండి అనుమతులు వస్తున్న తరుణంలో ప్రభుత్వాలు విధిస్తున్న సేఫ్టీ నిబంధనల వలన పెద్ద పెద్ద సినిమాలు తీయాలని అనుకునేవారికి అనేక ఇబ్బందులు ఎదుర్కోవటం ఖాయమని సినిమా విశ్లేషకులు అంటున్నారు.

IHG

అందుతున్న సమాచారం ప్రకారం పరిమిత సంఖ్యలో కొద్ది మంది తోనే సెట్ లో సినిమా షూటింగ్ జరగాలని తప్పకుండా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ప్రతి ఒక్కరు మాస్క్ ధరించి షూటింగులో పాల్గొనాలనే నిబంధనలు ప్రభుత్వాలు పెడుతున్నాయి. ఇటువంటి తరుణంలో ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో భారీ బడ్జెట్ సినిమాలైన  'ఆర్.ఆర్.ఆర్', 'పుష్ప' 'ఆచార్య' షూటింగ్స్ పరిస్థితి ఏంటని సినీ విశ్లేషకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

IHG

ఇప్పటికే వీటికి సంబంధించిన షూటింగులు సగంలో ఉన్నాయి. ఇటువంటి టైములో రాబోయే రోజుల్లో ఈ పెద్ద సినిమాల షూటింగులు చాలా కష్టతరంగా జరిగే అవకాశం ఉందని సిబ్బంది కొరత ఏర్పడే అవకాశం గ్యారెంటీ అనే టాక్ వినబడుతోంది. మరోపక్క భారీ తారాగణం పెద్ద పెద్ద సినిమాలలో ఉండే అవకాశం ఉండటంతో డేట్స్ అడ్జస్ట్మెంట్ అనేది కూడా పెద్ద తలనొప్పిగా మారే అవకాశం ఉందని రాబోయే రోజుల్లో నిబంధనలు పాటిస్తూ పెద్ద సినిమాల షూటింగ్ జరుపుకోవడం అనేది చాలా కష్టం అనే టాక్ వినపడుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: