ఒకప్పుడు తెలుగు సినిమా రంగానికి నందమూరి తారక రామారావు మరియు అక్కినేని నాగేశ్వరరావు రెండు కళ్ళు గా ఉండేవారు. ఇండస్ట్రీకి సంబంధించి ఎటువంటి సమస్య అయినా వీళ్లిద్దరు అడుగుపెడితే చాలు పరిష్కారం చిటికెలో జరిగిపోయేది. నటీనటుల మధ్య కూడా ఎప్పుడూ వాతావరణం కుటుంబం తరహాలో ఉండేది. పోటీ ఉన్నాగాని సినిమాల వరకే. అటువంటి నందమూరి కుటుంబానికి చెందిన తనని ఇటీవల చెందిన కొంతమంది పక్కన పెట్టడంతో బాలయ్య బాబు బరస్ట్ అవ్వటానికి కారణం అన్నట్టు ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి.

IHG

వాస్తవానికి అయితే బాలకృష్ణ వ్యక్తిత్వం ఒకరి దగ్గర నుండి మర్యాద ఆశించడం కానీ ఇవ్వడం గానీ పెద్దగా ఉండదు తన పనేదో తాను చేసుకుని పోతాడు. కానీ ఇటీవల ఇండస్ట్రీలో కావాలని అక్కినేని కుటుంబం మరియు మెగా హీరోలు తనని ఉద్దేశపూర్వకంగా పక్కన పెడుతున్నారని అందువల్లే బాలయ్య బాబు ఇండస్ట్రీ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం జరిగిందని అంటున్నారు. కరోనా వైరస్ విరాళాల సమయంలో కలిసిన వాళ్ళు ప్రభుత్వాలతో చర్చలు అన్నప్పుడు పిలవరా అని బాలయ్య బాబు అన్నట్లు టాక్.

IHG

అంతేకాకుండా మొన్నటి వరకు టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ఉండేదని కానీ ఇటీవల ఇండస్ట్రీ లో ఉండే పెద్దలే కావాలని ఇండస్ట్రీని వేరే పార్టీల వైపు మళ్ళించే కార్యక్రమం చేయడంతో బాలయ్య బాబు రాజకీయంగా కూడా ఫైర్ అయినట్లు సమాచారం. మొత్తమ్మీద బాలయ్య బాబు ఒక్కసారిగా బరస్ట్ అవ్వడం అటు ఇండస్ట్రీ పరంగా ఇటు పొలిటికల్ గా వెనక పెద్ద కథ ఉన్నట్లే అర్థమవుతోంది. మరి బాలయ్య బాబు రాబోయే రోజుల్లో ఇంకా ఏ విధంగా వ్యవహరిస్తారో ఇంకెన్ని వ్యాఖ్యలు చేస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: