సూపర్ స్టార్ మహేష్ బాబు 'మహర్షి' మరియు సరిలేరు నీకెవ్వరు వంటి బ్లాక్ బస్టర్ సినిమాల తర్వాత తన తదుపరి చిత్రాన్ని పరుశురాం దర్శకత్వంలో చేయనున్న విషయం తెలిసిందే. చిత్రానికి సంబంధించిన టైటిల్ మరియు ఫ్రీ లుక్ ను అతని తండ్రి కృష్ణ గారి పుట్టిన రోజున మే 31 తారీఖున అనౌన్స్ చేసిన విషయం కూడా తెలిసిందే. 'సర్కారు వారి పాట' అన్న టైటిల్ ఖరారు చేసుకున్న సినిమా యొక్క ప్రీ లుక్ లో మహేష్ చాలా ఎక్కువగా జుట్టు పెంచేసుకొని గతంలో ఎన్నడూ లేని విధంగా చెవిపోగు తో పాటు చాలా మాస్ గా మెడ మీద పాత రూపాయి బిళ్ళ టాటూ వేయించుకోవడం జరిగింది.

 

ఒక్క లుక్ తో సినిమాపై అభిమానుల్లో అంచనాలు మరియు శక్తి తారస్థాయికి చేరాయి. ఇక టైటిల్ చాలా చిత్రం గానూ మరియు ఆసక్తికరంగా ఉండగా టైటిల్ కి తగ్గట్టే సినిమా కూడా ఉంటుందని కొన్ని వార్తలు బయటకు వచ్చేసాయి. ముందుగా పరశురామ్ లవ్ స్టోరీ సినిమా చేస్తున్నాడని చెప్పినా…. మహేష్ మాస్ లుక్ లో కనిపించే సరికి అభిమానులు తెగ ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. ఇదే సమయంలో సోషల్ మీడియాలో సినిమా స్టోరీ లైన్ ఇదే అంటూ ఒక కథ వైరల్ అవుతుంది.

 

సినిమాలో మహేష్ బాబు వడ్డీ వ్యాపారిలా కనిపిస్తాడట. విదేశీ రాష్ట్రం లో ఉంటూ అక్కడి వారికి అప్పులిచే వ్యక్తిగా మహేష్ బాబు కనిపించనున్నారట. అయితే మహేష్ అప్పులు ఇచ్చే టపుడు, తీసుకునే సమయం లో చాలా ఖచ్చితంగా ఉంటాడు అట. అయితే మన మహేష్ బాబు అప్పులు వాసులు చేసేపుడు, ఇచ్చేపుడు జరిగే సంభాషణలు చాలా ఫన్నీ గా ఉంటాయట. సినిమాలో ఊహించని ట్విస్ట్ కూడా ఉండే అవకాశం ఉందని సమాచారం. మొత్తం మీద సినిమా మూవీ ఫుల్ ఎంటర్టైన్మెంట్ తరహాలో డైరెక్టర్ పరుశురాం చూపించ నున్నట్లు సమాచారం

మరింత సమాచారం తెలుసుకోండి: