శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ స్టార్ డమ్ పై కరోనా నీళ్లు చల్లింది. శ్రీదేవిలా హిందీ ఇండస్ట్రీని ఏలాలని కలలు కనింది. కరోనా మహమ్మారి జాన్వీకి ఉ్న క్రేజ్ ను లాక్కెళ్లిపోతోంది. 

 

తెలుగులో బంపర్ ఆఫర్స్ వచ్చినా.. జాన్వి కపూర్ ఏరికోరి హిందీ మూవీ ధడక్ మూవీతో వెండితెరకు పరిచయమైంది. డెబ్యూ మూవీతోనే 100కోట్ల మార్క్ దాటింది. దీంతో ఆఫర్స్ వెల్లువెత్తాయి. ప్రస్తుతం మూడు సినిమాలు చేస్తున్నా.. ఉపయోగం లేకుండా పోయింది. ఈ అమ్మడు నటించిన సినిమాలన్నీ.. థియేటర్స్ లోకి రాకుండానే.. ఓటీటీలో రిలీజ్ అవుతున్నాయి. 

 

ధడక్ తర్వాత జాన్వీ నటించిన సినిమా ఘోస్ట్ స్టోరీస్. ఈ సినిమాను నెట్ ప్లిక్స్ కోసమే రూపొందించడంతో థియేటర్స్ లో విడుదల కాలేదు. రిలీజ్ కు రెడీగా ఉన్న గుంజాన్ సక్సేనా.. రూహీ ఆప్జా సినిమాలు కూడా.. ఓటీటీని ఆశ్రయించడంతో.. తండ్రి బోనీకపూర్ కూతురు స్టార్ డమ్ పై బెంగపెట్టుకున్నాడు. కెరీర్ ఆరంభంలోనే లేడీ ఓరియెంటెడ్ మూవీ గుంజాన్ సక్సేనాలో నటించే అవకాశం జాన్వీకి వచ్చింది. కార్గిల్ యుద్ధం సమయంలో గాయపడిన సైనికులను సురక్షిత ప్రదేశానికి తీసుకొచ్చిన పైలెట్ గుంజాన్ సక్సేనా బయోపిక్ ఇది. 

 

రూహి ఆప్జా పేరుతో రూపొందే చిత్రంలో జాన్వీ డ్యూయెల్ రోల్ పోషించనుంది. థియేటర్స్ మూతపడటంతో ఈ రెండు సినిమాలను డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు. సినిమా ఎంత బాగున్నా.. బెస్ట్ పెర్ ఫార్మెన్స్ ఇచ్చినా.. థియేటర్ లో వచ్చినంత రెస్పాన్స్ ఓటీటీలో రాదన్న బాధ బోనీ ఫ్యామిలీని వెంటాడుతోంది. 

 

రిలీజ్ ఎక్కడ చేయాలనేది నిర్మాతల ఇష్టం కాబట్ట.. బోనీ కపూర్ చేతుల్లో ఏమీ లేదు. ధడక్ తర్వాత రెండేళ్లు గ్యాప్ వచ్చినా.. రెండు మంచి సినిమాలు వస్తున్నాయనుకున్న బోనీ ఆనందాన్ని కరోనా ఆవిరి చేసింది. తఖ్త్ పెద్ద సినిమా కాబట్టి.. ఎట్టి పరిస్థితుల్లోనూ.. ఈ బొమ్మ థియేటర్స్ లో పడాల్సిందే. ఓటీటీ అనుభవంతో.. ఇక జాన్వీ పెద్ద సినిమాలకే గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశముంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: