మహేశ్, పూరీ కాంబినేషన్ లో సినిమా ఉంటుందా.. ఉండదా.. ఉండదని పూరీ గతేడాది క్లారిటీ ఇచ్చేశాడు. అయితే మహేశ్ మాత్రం పూరీ సినిమాపై ఆశలు రేపాడు. పూరీతో సినిమా కోసం ఎదురు చూస్తున్నామనీ ఓ అభిమాని అడుగగా మహేశ్ చెప్పిన సమాధానం ఆశలు రేకెత్తించింది. పూరీ, మహేశ్ కలయికలో మూడో సినిమా ఎప్పుడో తెలుసా.. 

 

ఇస్మార్ట్ శంకర్ రిలీజ్ తర్వాత మహేశ్ బాబుపై పూరీ జగన్నాథ్ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. ఇస్మార్ట్ సక్సెస్ తర్వాత పూరీ మారిపోయాడనీ.. మనసులో మాట బయట పెట్టాడన్నారు. మహేశ్, పూరీ మధ్య ఏమయిందో ఏమోగానీ.. మహేశ్ పై ఘాటుగా స్పందించాడు దర్శకుడు. మహేశ్ తో సినిమా ఎప్పుడంటూ.. ఆయన అయన అభిమానులు తనకు మెసేజ్ లు పంపిస్తూ ఉంటారనీ.. మహేశ్ కంటే సూపర్ స్టార్ ఫ్యాన్స్ అంటే ఇష్టమనీ చెప్పాడు. ఒకవేళ మహేశ్ ఛాన్స్ ఇస్తే చేస్తారా.. అని అడిగితే తనకు కూడా క్యారెక్టర్ ఉంటుంది కదా అని చెప్పడంతో.. ఈ ఇద్దరి కాంబోలో సినిమా ఉండదని తేలిపోయింది. 

 

సక్సెస్ లో ఉంటేనే మహేశ్ నటిస్తాడన్న పూరీ మాటల్లో నిజం లేదు. పోకిరీకి ముందు.. పూరీ తీసిన సూపర్.. 143..ఆంధ్రావాలా నిరాశపరిచాయి.  అలాగే బిజినెస్ మేన్ కు ముందు పూరీ ఫ్లాపుల్లో ఉన్నాడు. బుజ్జిగాడు.. నేనింతే.. ఏక్ నిరంజన్.. గోలీమార్.. నేను నా రాక్షసి ఫ్లాప్ తర్వాత హిందీలో అమితాబ్ తో బుడ్డా హోగా తేరా బాప్ తీశారు. అది కూడా యావరేజ్ గా ఆడింది. 

 

బిజినెస్ మేన్ తర్వాత పూరీ మహేశ్ తో జనగణమన మూవీ ఎనౌన్స్ చేశాడు. మహేశ్ వేరు ప్రాజెక్ట్ లో బిజీగా ఉండటంతో జనగణమన వాయిదా పడింది. ఆ తర్వాత పూరీ వరుస ఫ్లాపుల్లో పడిపోవడంతో.. మహేశ్ జనగణమనపై ఇంట్రెస్ట్ చూపించలేదన్న టాక్ వినిపించింది.

 

సూపర్ స్టార్ కృష్ణ బర్త్ డే సందర్భంగా మహేశ్ ఇన్ స్టా లైవ్ లోకి వచ్చారు. పూరీతో సినిమా కోసం ఎదురు చూస్తున్నామనీ ఓ అభిమాని అడుగగా.. ఖచ్చితంగా ఆయన దర్శకత్వంలో నటిస్తాననీ.. తనకు ఇష్టమైన దర్శకుల్లో పూరీ ఒకరన్నారు మహేశ్. పూరీ కథ నరేట్ చేస్తారేమో అని ఇప్పటికీ వెయిట్ చేస్తున్నానని చెప్పాడు మహేశ్.  

 

మహేశ్ తో వర్క్ చేయాలని పూరీకి లేకపోయినా..పూరీ డైరెక్షన్ లో నటించాలని మహేశ్ అనుకుంటున్నాడు. నిన్నటి వరకు తన కోర్టుల ఉన్న బంతిని పూరీ కోర్టులోకి వేసేశాడు మహేశ్. 

 

మహేశ్ మాటలు విన్నతర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్ పై రకరకాల ప్రశ్నలు వినిపిస్తాయే గానీ.. సమాధానం మాత్రం దొరకడం లేదు. జనగణమన కథను పూరీ మహేశ్ కు చెప్పాడా.. చెబితే నచ్చలేదా.. సరిలేరు నీకెవ్వరులో దేశభక్తిని టచ్ చేశాడు కాబట్టి.. జనగణమన బదులు వేరే కథ కావాలంటాడా.. ఇలా ఇద్దరూ ఫ్యాన్స్ ను కన్ ఫ్యూజ్  చేస్తున్నారు. లాక్ డౌన్ మొదలైనప్పుడు మహేశ్ తన మనసులోని మాట చెబితే.. చకచకా కథలు రాసే పూరీ బౌండెడ్ స్క్రిప్ట్ తో రెడీగా ఉండే వాడు. మరి పూరీ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: