కన్నడ భామ రష్మిక మందన్న తెలుగులో సూపర్ ఫామ్ లో ఉంది. వరుస స్టార్ ఛాన్సులు అందుకుంటున్న ఈ భామ కన్నడలో కూడా చేతినిండా ఆఫర్లు అందుకుంది. అక్కడ ఇక్కడ రెండు చోట్ల సినిమాలతో బిజీగా ఉండే రష్మిక ఈ లాక్ డౌన్ టైం లో చాలా బోర్ ఫీల్ అవుతున్నట్టు తెలుస్తుంది. అంతేకాదు చిన్నప్పటి నుండి హాస్టల్ లోనే ఉన్న తాను ఇన్ని రోజులు ఇంట్లో ఉండటం కూడా భరించలేకపోతుందట. ఇదిలాఉంటే హీరోయిన్ అయ్యాక ఎవరైనా కవర్ పేజ్ కు వస్తారు. కానీ రష్మిక మాత్రం చిన్నప్పుడే కవర్ పేజ్ కు ఎక్కింది. అదెలా అంటే.. చిన్నప్పుడే అమ్మడి అందరిని ఎట్రాక్ట్ చేసింది. 

 

గోకులం అనే చిన్నపిల్లలా మేగజైన్ కోసం రష్మిక కవర్ పేజ్ పై స్టైల్ ఇచ్చింది. ఆ ఫోటో చూస్తే అప్పటి నుండి ఇప్పటివరకు రశ్మికలో ఆ అల్లరి, చిలిపితనం అలానే ఉన్నాయని అనిపిస్తుంది. 2001లో గోకులం మేగజైన్ కోసం ఇచ్చిన స్టిల్ అది. అంటే తన వయసు కూడా చెప్పకనే చెప్పే ప్రయత్నం చేస్తుంది రష్మిక. ఈ ఇయర్ మొదట్లోనే సరిలేరు నీకెవ్వరు సినిమాతో సూపర్ హిట్ అందుకున్న రష్మిక అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో తెరకెక్కబోతున్న పుష్ప సినిమాలో నటిస్తుంది. 

 

ఈ సినిమాతో పాటుగా మరో రెండు ప్రాజెక్టులకు సైన్ చేసిందని తెలుస్తుంది. తానూ హీరోయిన్ మెటీరియల్ అని చిన్నప్పుడే ఫిక్స్ అయ్యింది కావొచ్చు.. అందుకే అమ్మడు 20 ఏళ్ల క్రిందటే మేగజైన్ కవర్ పేజ్ కవర్ చేసింది. ఈ పిక్ షేర్ చేసి తన ఫ్యాన్స్ ను అలరించి రష్మిక. ప్రస్తుతం రష్మిక చిన్నప్పటి ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అభినయ తారగా రష్మిక మందన్న అనతికాలంలోనే సూపర్ క్రేజ్ తెచ్చుకుంది.    

మరింత సమాచారం తెలుసుకోండి: