మెగా హీరోల్లో ఎవరు ఏ సినిమా చేస్తున్నా సరే మెగాస్టార్ చిరంజీవి కనుసన్నల్లో నడవాల్సిందే. ముఖ్యంగా మెగా మేనళ్లుడు సాయి తేజ్ తను ఏ సినిమా చేయాలని అనుకున్నా మెగా సపోర్ట్ తీసుకుంటాడు. ఇక ఇప్పుడు మెగా ఫ్యామిలీ నుండి రాబోతున్న మరో హీరో మెగా మేనళ్లుడు సాయి తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ కూడా ఉప్పెన సినిమాతో సత్తా చాటేందుకు వస్తున్నాడు. సుకుమార్ దగ్గర అసిస్టెంట్ గా పనిచేసిన బుచ్చిబాబు డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మించారు. 

 

రిలీజ్ కు రెడీ అవుతున్న ఈ సినిమాకు మరోసారి ఎడిటింగ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. సినిమా మొత్తం రష్ 4గంటలు రాగా దానిలో రెండున్నర గంటలకు పైగా సినిమా ఫైనల్ కట్ చేశారట. అయితే సుకుమార్ అది కూడా ఎక్కువ అవుతుందని భావించి మళ్ళీ రీ ఎడిట్ చేస్తున్నారట. అంతేకాదు ఈసారి మెగాస్టార్ చిరంజీవి కూడా ఉప్పెన విషయంలో జోక్యం చేసుకుంటున్నారట. సినిమాలో కొన్ని సీన్స్ చూసి మెచ్చుకున్నారట. ఫైనల్ కట్ అయ్యాక మరోసారి చూసి రిలీజ్ చేసేలా చూస్తున్నారు. సినిమా నుండి వచ్చిన సాంగ్స్ రెండు సూపర్ హిట్ అయ్యాయి. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాలోని మిగతా సాంగ్స్ కూడా చాలా బాగుంటాయని అంటున్నారు. 

 

చిరు హ్యాండ్ పడుతుంది అంటే కచ్చితంగా సినిమా ప్రేక్షకులు మెచ్చేలా అంచనాలను అందుకున్నట్టే. ఈ సినిమాలో వైష్ణవ్ తేజ్ సరసన కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. రిలీజ్ ముందే ఈ జోడీపై మంచి క్రేజ్ పెరిగింది. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి. ఉప్పెన సినిమాలో తమిళ విలక్షణ నటుడు విజయ్ సేతుపతి విలన్ గా నటించాడు.               
 

 

మరింత సమాచారం తెలుసుకోండి: