మన తెలుగు సినిమాలో ప్రత్యేకంగా చెప్పుకునే గాయకుల్లో ఎస్పీ బాలు ఒకరు. ఆయన పాడిన పాటలు ఆయన సాధించిన విజయాలు అన్ని కూడా ఒక సంచలనమే. ఆయనకు ఎవరికి రాని పేరు అనేది చాలా వరకు తక్కువ కాలంలోనే వచ్చింది అని చెప్పవచ్చు. ఆయన పాడిన పాటలను మాత్రం ఎవరూ పాడలేరు అనే విధంగా ఆయన పాడారు టాలీవుడ్ లో నిలబడ్డారు. టాలీవుడ్ లోనే కాదు సినిమాల్లో నిలబడ్డారు అని చెప్పవచ్చు. అయితే ఆయన గురించి కొన్ని ప్రత్యేకంగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఆయన వివాదాలకు చాలా వరకు దూరంగా ఉంటారు. 

 

అవును వివాదాలను ఆయన ఎప్పుడు కూడా దగ్గరకి తెచ్చుకున్న సందర్భం అనేది ఎప్పుడు కూడా లేదు అనే చెప్పవచ్చు. చాలా మంది స్టార్ హీరోలతో ఆయన పని చేసారు. ఎందరో అగ్ర దర్శకులతో ఆయన కలిసి నడిచారు. అయినా సరే ఏ రోజు కూడా ఒక్క వివాదం తో కూడా ఆయన సావాసం చేసిన సందర్భం అనేది ఎప్పుడు లేదు అనే చెప్పవచ్చు. అందుకే ఆయనను చాలా మంది గౌరవిస్తూ ఉంటారు. ఆయన కెరీర్ లో చాలా సౌమ్యుడి గానే ఉన్నారు గాని ఎవరి తో కూడా కయ్యానికి వెళ్ళిన సందర్భం అనేది ఎప్పుడు లేదు అనే చెప్పాలి. 

 

ఆయన చాలా వరకు అలాగే వ్యవహరించారు కూడా. ప్రస్తుతం ఆయన వివాదాలతో దూరంగా ప్రశాంతంగా ఉన్నారు అయితే ఇళయరాజ విషయంలో మాత్రం బాలు కాస్త ఇబ్బంది పడ్డారు అని చెప్తూ ఉంటారు. ఇళయరాజా తో ఆయనకు మూడేళ్ళ క్రితం వివాదం వచ్చినా సరే ఆయన మాత్రం చాలా సౌమ్యంగా ఆ వివాదాన్ని పరిష్కరించుకుని తన కంటూ ఒక విలువ ని ఆయన ఉంచుకున్నారు. ఆ విధంగా బాలు తన కెరీర్ లో సినిమా లు చేస్తూ వచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: