1967వ సంవత్సరంలో విడుదలైన శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న సినిమాలో మొట్టమొదటిగా పాట పాడిన ఎస్పీ బాలసుబ్రమణ్యం ఐదు దశాబ్దాలకు పైగా 16 భారతీయ భాషలలో 40000 పాటలను పాడి భారత దేశ వ్యాప్తంగా కోట్ల మంది శ్రోతలను అలరించారు. దాదాపుగా 70 సినిమాలకు పైగా సంగీత దర్శకత్వం వహించారు. సల్మాన్ ఖాన్ సినిమాలు విజయవంతం అయ్యేందుకు ఎస్పీ బాలసుబ్రమణ్యం గాత్రం కీలకమైన పాత్ర వహించింది అని అందరూ చెబుతుంటారు. అతను కేవలం ఒక్క రోజులోనే 16 హింది పాటలను పాడి రికార్డు సృష్టించాడు. మొదటిగా ఏక్ డుజే కే లియే (1981) అనే హిందీ చిత్రంలో బాలసుబ్రహ్మణ్యం పాట పాడి ఉత్తమ పురుష ప్లేబ్యాక్ సింగర్‌ గా నేషనల్ ఫిలిం అవార్డ్ పురస్కారాన్ని అందుకున్నాడు.


అయితే బాల సుబ్రహ్మణ్యం కాలక్రమేణా బాలీవుడ్ పరిశ్రమకు దూరమయ్యారు. ఇందుకు కారణాలు లేకపోలేదు. బాలీవుడ్ సినీ నిర్మాతలు దర్శకులు కావాలనే బాలసుబ్రహ్మణ్యానికి పాటలు పాడే అవకాశాలను ఇవ్వట్లేదు. ఎందుకంటే గత 20 ఏళ్లుగా బాలీవుడ్ పరిశ్రమలో ఎంతోమంది ప్రతిభ కలిగిన గాయనీ గాయకులు విచ్చేస్తున్నారు. అలాగే వారు చాలా తక్కువ వేతనానికి పాటలు పాడుతున్నారు. అందుకే బాలీవుడ్ సినీ నిర్మాతలు వారికే ప్రాధాన్యత ఎక్కువగా ఇస్తున్నారు. 


అలాగే బాలీవుడ్ పరిశ్రమలో ఎక్కువగా వెస్ట్రన్ సంగీత నేపథ్యంలో కొనసాగే పాటలు వస్తున్నాయి. బాలీవుడ్ పరిశ్రమలో ఎక్కువగా డిజెలు, రాప్ సాంగులు, రాక్ మ్యూజిక్, పాప్ మ్యూజిక్ పాటలు వస్తున్నాయి. దాదాపు అన్ని హిందీ మెలోడీ పాటలను అర్జిత్ సింగ్, శ్రేయ ఘోషల్ చేజిక్కించుకుంటుండగా... మిగతా వారికి చాలా తక్కువ ఛాన్స్ లు వస్తున్నాయి. ఒకవేళ బాలసుబ్రహ్మణ్యం పాడిన తనకు ఎక్కువ రెమ్యూనరేషన్ తప్పకుండా ఇవ్వాల్సిందే. అందుకే బాలసుబ్రహ్మణ్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం లేదు దర్శకనిర్మాతలు. నిజానకి పాటల్లో కూడా పచ్చి బూతు పదాలు ఉండడంతో బాల సుబ్రహ్మణ్యం పాటలు దూరంగా ఉంటున్నాడని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: