సినిమాల్లో అవకాశాలు చేజిక్కించుకునేందుకు ఎస్పీ బాలసుబ్రమణ్యం 1963వ సంవత్సరంలో మద్రాసు వెళ్లగా... ఆ సమయంలోనే సోషల్ కల్చరల్ క్లబ్ వాళ్ళు దక్షిణామూర్తి, ఘంటసాల, పెండ్యాల లాంటి ఉద్దండులతో ఇండియా లెవెల్ లో మ్యూజిక్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ ప్రోగ్రాం లో సినిమా పాటలు కాకుండా సొంతంగా రాసుకున్న పాటలు పడాలి. అయితే ఈ ప్రోగ్రాంలో పది రూపాయలు ఎంట్రీ ఫీజు ని తన స్నేహితుడు చెల్లించగా... బాలసుబ్రహ్మణ్యం బాగా ప్రిపేర్ అయ్యి ఘంటసాల పెండ్యాల ఎదుట రాగములో ఒక అనురాగములో అనే పాట పాడాడు. మూడు రోజుల తర్వాత ఈ ప్రోగ్రామ్ ఫలితాలు వెల్లడిస్తూ... శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యమునకు ప్రథమ బహుమతిని దక్కించుకున్నారని ప్రకటించారు. 


బహుమతి తీసుకున్న తర్వాత సంగీత దర్శకుడు కోదండపాణి బాలసుబ్రహ్మణ్యమును పరిచయం చేసుకొని చాలా బాగా పాడావు అని ప్రశంసించారు. ఆ రోజు నుండి బాలసుబ్రహ్మణ్యం సినిమా అవకాశాల కోసం బాగా తిరగడం ప్రారంభించాడు. అయితే తన కాళ్ళ చెప్పులు అరిగేలా తిరిగినప్పటికీ ఎవరూ తనకి పాటలు పాడేందుకు అవకాశం ఇవ్వలేదు. చివరికి కోదండపాణి ఎస్పీ బాలసుబ్రమణ్యమునకు తప్పకుండా ఏదో ఒక పాట ఇవ్వాలని నిశ్చయించుకున్నారు. కానీ సినీ నిర్మాతలు మాత్రం బాలసుబ్రమణ్యం గొంతు చాలా లేత గా ఉందని రెండేళ్లు ఆగాలని చెప్పారు. దాంతో తీవ్ర నిరాశకు గురైన బాలసుబ్రమణ్యం తనతో పాటు తెచ్చుకున్న మూడు జతల బట్టలను ప్రతిరోజు మారుస్తూ పిచ్చోడిలా సైకిల్ పైన ప్రతి స్టూడియో వెంట తిరిగేవాడు. ఆ క్రమంలోనే కోదండపాణి అతనిని చూసి జాలిపడి... ఒక బట్టల షాప్ కి తీసుకెళ్లి బట్టలు కొనిచ్చి తన అసిస్టెంట్ గా జాయిన్ చేసుకున్నాడు. అనంతరం తను కోదండపాణి దగ్గర సంగీతంలో కొన్ని మెళకువలు నేర్చుకున్నాడు. 

 

కొన్ని నెలల తర్వాత నిర్మాత పద్మనాభం గారి నిర్మిస్తున్న శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న చిత్రంలో ఒక పాట కి నాలుగు చరణాలు ఉండగా... పి సుశీల ఒక చరణం, ఈలపాటి రఘురామయ్య ఒక చరణం, పీవీ శ్రీనివాసరావు ఒక చరణం పాడగా... మిగిలిన 4వ చరణం ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం తో పాడిద్దామని నిర్మాత అయిన పద్మనాభముని కోదండపాణి అడగగా... ఆయన బాలసుబ్రహ్మణ్యం తో పాట పాడించుకుని తర్వాత పర్మిషన్ ఇచ్చాడు. ఆ తర్వాత మిగతా ముగ్గురు గాయకులతో కలిసి రిహార్సల్ చేసి కోదండపాణి సారథ్యంలో రికార్డింగ్ స్టూడియోలో 4వ చరణం అద్భుతంగా పాడి శభాష్ అనిపించుకున్నాడు. ఐతే బాలసుబ్రహ్మణ్యం మొట్టమొదటిగా పాడిన సినిమా పాట ఏమి ఇంత మోహం కాగా... తాను శోభన్ బాబు కి గాత్రదానం చేశాడు. ఈ విధంగా బాల సుబ్రహ్మణ్యం సంగీత దర్శకుడు కోదండపాణి సహాయంతో సినిమాల్లో రంగప్రవేశం చేసి భారతదేశంలోనే అత్యంత ప్రతిభ కలిగిన నేపథ్యగాయకుడిగా పేరుపొందాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: