ఒక సినిమాలో పాపులర్ అయిన కొన్ని అంశాలు ఉంటాయి. ఆ అంశాల ద్వారానే ఆ సినిమాలు కూడా పాపులర్ అవుతుంటాయి. అయితే తెలుగు సినిమా చరిత్రలో వినూత్నమైన కథాంశంతో వచ్చిన ఒక్కడు సినిమాలో అలాంటి పాపులర్ అంశాలు చాలా ఉన్నాయి. మహేష్ బాబు కెరీర్లో మొట్టమొదటి మాస్ హిట్ గా నిలిచిన ఒక్కడు చిత్రం గురించి చెప్పుకోవాలంటే చాలా అంశాలు ఉన్నాయి. యాక్షన్, కామెడీ, ఫ్యాక్షన్ ఇలా ఏ అంశం తీసుకున్నా ప్రతీదీ ఆసక్తికరమే.

 

అయితే కామెడీ పరంగా చూస్తే ద్పాస్ పోర్ట్ ఆఫీసరుగా ధర్మవరపు సుబ్రమణ్యం పండించిన కామెడీ అద్భుతమనే చెప్పాలి. పాస్ పోర్ట్ కోసం వచ్చిన మహేష్ ఫ్రెండ్స్  ధర్మవరపు సుబ్రమణ్యాన్ని చికాకు పెట్టే సన్నివేశం బాగా పేలింది. కొత్తగా మొబైల్ తీసుకున్న పాస్ పోర్ట్ ఆఫీసరు ఆ నంబర్ కి తన ప్రియురాలి నుండి ఫోన్ వస్తుందని ఎదురుచూస్తూ ఉన్నప్పుడు, మహేష్ అండ్ ఫ్రెండ్స్ ఏడిపించే సీన్ సినిమాకే హైలైట్.

IHG

అయితే ఈ సీన్ చేస్తున్నప్పుడు మొబైల్ నంబర్ ఎవరిది పెడదామా అని ఆలోచిస్తున్న టైమ్ లో ఎవరో ఇచ్చిన సజెషన్ మేరకు నిర్మాత ఎమ్ ఎస్ రాజు గారి నంబర్ పెట్టారంట. సినిమాలో ధర్మవరపు సుబ్రమణ్యం స్టైల్ గా చెప్పే  9848032919 నంబర్ నిర్మాత ఎమ్ ఎస్ రాజుగారిదేనంట. అయితే సినిమా రిలీజ్ అయ్యాక ఈ నంబర్ బాగా పాపులర్ అయింది. దాంతో నిర్మాతకి విపరీతంగా ఫోన్ కాల్స్ వచ్చాయంట. 

 

ఆ కాల్స్ ని భరించలేని నిర్మాత నంబర్ మార్చేసారట. భూమికా చావ్లా హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో మహేష్ బాబులోని మాస్ యాంగిల్ కనిపించింది. గుణశేఖర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అలాంటి పాపులర్ సన్నివేశాలు చాలానే ఉన్నాయి. కొండారెడ్డి బురుజు వద్ద ఫైట్ అనగానే గుర్తొచ్చే సినిమా మహేష్ బాబు నటించిన ఒక్కడు మాత్రమే..

మరింత సమాచారం తెలుసుకోండి: