మన తెలుగులో ఎస్పీ బాలుకి ఉన్న క్రేజ్ గురించి ఎంత చెప్పినా సరే తక్కువే అవుతుంది. ఏ గాయకుడికి అంత తక్కువ కాలంలో ఆ స్థాయిలో పేరు రాలేదు. ఆయనకు వచ్చిన ఇమేజ్ ఎవరికి కూడా అసలు అంత తక్కువ కాలంలో రావడం కూడా సాధ్యం కాలేదు. ఇక ఆయనను పాప్ సింగర్ గా చూడాలి అనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. సాధారణంగా రచయితలు పాటలు పాడే సమయంలో ఎవరు పాడినా పర్వాలేదు అనే విధంగా ఉంటారు. కాని బాలు పాటలు పాడే విధంగా రచయితలు రాసిన సందర్భాలు కూడా ఉన్నాయి అని చెప్తారు. 

 

ఆయన పాటల కోసం రచయితలు చాలా వరకు ఎదురు చూసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆయన అయితేనే పాటకు అందం వస్తుంది అని సిరివెన్నెల సహా ఎందరో రచయితలు భావించారు కూడా. ఆ విధంగా బాలు పేరు తెచ్చుకున్నారు. తమిళంలో అయినా సరే బాలు కోసం పాట రాసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆ విధంగా ఆయనకు ఒక రేంజ్ లో ఎవరికి రాని విధంగా గుర్తింపు వచ్చింది అనేది వాస్తవం. ఇప్పుడు ఉన్న చాలా మంది ఆయన నుంచి నేర్చుకున్న వాళ్ళే ఉన్నారు అనే విషయం అందరికి తెలిసిందే. చాలా మంది స్టార్ హీరోలు అయితే ఆయన పాటలను సినిమాలో ఉంచాలి అని డిమాండ్ చేసిన సందర్భాలు కూడా ఉనాయి. 

 

ఇక సిరి వెన్నెల విషయానికి వస్తే ఆయన పాట రాసే సమయంలో బాలు గొంతు కోరుకుని ప్రత్యేకంగా ఆయన అయితేనే ఆ పదాని ఆ పాటకు అందం వస్తుంది అని రాసిన సందర్భాలు కూడా ఉన్నాయి అంటారు. ఆ విధంగా బాలు  సినిమాలలో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసారు. బాలు ఇప్పుడు అయినా ఎప్పుడు అయినా సరే ఎవర్ గ్రీన్.

మరింత సమాచారం తెలుసుకోండి: