టాలీవుడ్ లో ఇప్పుడు ఉన్న గాయకులూ చాలా మందికి ఇతర భాషల్లో అవకాశాలు రావడం అనేది చాలా వరకు కష్టం. చిన్న హీరోలు అయినా సరే పెద్ద హీరోలు అయినా సరే వారి సినిమాల్లో ఇతర భాషల్లో పాడటం అనేది చాలా వరకు కష్టమే. ఇక నేడు అయితే చాలా మందిని ఇతర భాషల్లో తీసుకోవడానికి ఏ భాష వారు అయినా సరే ఇబ్బందులు పడుతున్నారు అని అంటూ ఉంటారు. చిన్న వారిని అయినా పెద్ద వారిని అయినా సరే పక్కన పెడుతున్నారు అనే వార్తలు ఈ మధ్య కాలంలో ఎక్కువగా మనం వింటూనే ఉన్నాం. 

 

అయితే కొందరి విషయంలో మాత్రం అలా లేదు అనేది ఏ భాషలో అయినా సరే చెప్పే మాట. ఎస్పీ బాలు పాటల కోసం తమిళ సినిమా ముందు నుంచి కూడా ఎదురు చూసింది. ఆయన తో ఒక్క పాట పాడించాలి అనుకున్న వాళ్ళు ఎందరో ఉన్నారు అని చెప్తారు. అగ్ర హీరోలు అయినా చిన్న హీరోలు అయినా సరే ఆయన తో తమ సినిమాల్లో పాట పాడించడానికి గానూ చాలా వరకు ఎదురు చూసిన సందర్భాలు అనేవి ఉన్నాయి అని అంటారు. కొంత మంది హీరోలు అయితే సినిమా ఓకే చేయగానే బాలు పాడాలి అని డిమాండ్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి అంటారు. 

 

బాలు పాటల కోసం వాళ్ళు డేట్స్ కూడా వాయిదా వేసుకున్నారు అని అంటారు. సాధారణంగా హీరో డేట్స్ వాయిదా వేసుకునే అవసరం ఉండదు. కాని ఆయన పాడితే ఆ విధంగా సన్నివేశాలను షూట్ చేయవచ్చు అని హీరోలు కూడా నమ్మిన సందర్భాలు ఉన్నాయి. అందుకే ఆయనకు తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా ఎక్కువగా అవకాశాలు వచ్చాయి అని అంటారు. ఇప్పటికి కూడా ఆయనకు అక్కడ డిమాండ్ ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: