భారతీయ సంగీత ప్రపంచంలో తిరుగులేని స్థాయికి ఎదిగిన గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం. తెలుగు పాటు భారతీయ భాషలన్నింటిలో ఎన్నో అద్భుతమైన పాటలను ఆలపించిన ఎస్పీబీ పాటల ఎంపికలోనూ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటాడు. తాను పెట్టుకున్న నియమాలకు లోబడి లేని పాటలు ఏ స్థాయి వారు ఇచ్చినా మొహమాటం లేకుండా రిజెక్ట్ చేస్తాడు ఎస్పీ. అలా రిజెక్ట్ చేసిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి.

 

ఏకంగా మెగాస్టార్ చిరంజీవి పాటకు కూడా నో చెప్పాడు. చిరంజీవి హీరోగా గుణ శేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన సూపర్ హిట్ సినిమా చూడాలని ఉంది. ఈ సినిమాకు మణిశర్మ సంగీతమందించాడు. అయితే ఈ సినిమాలోని ఓ స్పెషల్ సాంగ్ కోసం ఎస్పీని సంప్రదించారు. చిరు మీద చిత్రీకరించిన స్పెషల్ సాంగ్ రామ్మా చిలకమ్మ. ఈ పాటను ముందుగా ఎస్పీతోనే పాట పాడించాలని అనుకున్నాడు మణిశర్మ. ఈ మేరకు ఎస్పీకి లిరిక్స్ కూడా పంపించారు.

 

అయితే ఆ పాటలో కొన్ని అభ్యంతర కర పదాలు ఉండటంతో ఎస్పీ పాట పాడేందుకు నిరాకరించారట. ఆ పదాలను మారిస్తేనే పాట పాడుతానని పట్టు పట్టడంతో చిత్రయూనిట్ ఆలోచనలో పడ్డారు. లిరిక్‌ రైటర్‌ పాటలోని పదాలను మార్చేందుకు అంగీకరించకపోవటంతో తప్పని పరిస్థితుల్లో మరో గాయకున్ని సంప్రదించాల్సి వచ్చింది. దీంతో మణి శర్మ ఈ పాటను ఎస్పీకి బదులుగా శంకర్ మహదేవన్‌తో పాడించాడు. అయితే శంకర్ మహాదేవన్‌ పాడినా ఆ పాట అద్భుతమైన విజయం సాధించింది. అలా చాలా సందర్భాల్లో ఎస్పీ తన వరకు వచ్చిన అవకాశాలను వదులుకున్నాడు.

 

ఈ రోజు ఈ మహా గాయకుడి పుట్టినరోజు ఈ రోజు ఈ సందర్భంగా సంగీతాభిమానుల తో పాటు సినీ అభిమానులు కూడా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: