తెలుగు సినిమాని తన గాత్రంతో దశాబ్దాల పాటు తన్మయత్వంలో ముంచేశాడు గాన గంధర్వుడు అనిపించుకున్న ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం. ముఖ్యంగా డబ్బై, ఎనభై దశకాల్లో బాలసుబ్రహ్మణ్యం గాత్రం లేకుండా దాదాపు ఏ సినిమా లేదంటే అతిశయోక్తి కాదు. ఏ హీరో పాట చూసినా అచ్చం ఆ హీరోనే పాట పాడుకుంటున్నాడా అనిపించేంత మ్యాజిక్ చేయడం బాలసుబ్రహ్మణ్యం స్పెషల్. అదే మ్యాజిక్, ట్రిక్ తో తెలుగు సినిమాను ఏలేశాడు. ముఖ్యంగా తెలుగులో మెగాస్టార్ చిరంజీవి ఎరా స్టార్ట్ అయ్యాక చిరంజీవికి విపరీతమైన క్రేజ్ తెచ్చినవాటిలో పాటలు ముఖ్యపాత్ర పోషించాయి.

IHG

 

చిరంజీవికి సంబంధించి పాటలు ఎంతో ఫోర్స్ గా, గొంతులో రఫ్ నెస్ కనిపించాలి. చిరంజీవి యాక్టివ్ నెస్ చూసి బాలసుబ్రహ్మణ్యం అలా పాడేవారా.. బాలసుబ్రహ్మణ్యం పాడిన తీరుకు చిరంజీవి ఆస్థాయిలో డ్యాన్సులు చేసేవాడా అంటే చెప్పడం కష్టమే.  ఆస్థాయిలో తెర వెనుక బాలు.. తెర ముందు చిరంజీవి మాయ చేసేవారు. ఎన్నో సందర్భాల్లో.. ‘చిరంజీవికి పాట పాడాలంటే చాలా ఎంజాయ్ చేస్తాను.. ఎంత హైపిచ్ కి వెళ్లగలనో అంత స్థాయికి వెళ్లాలనిపిస్తుంది.. వెళ్తాను’ అని బాలూ చెప్పుకొచ్చారు. చిరంజీవి కూడా.. ‘బాలూ గారు పాట పాడితే ఓ కిక్ వస్తుంది. నాలో డ్యాన్స్ రెచ్చిపోయి చేయాలనే కోరిక వస్తూంటుంది’ అని చెప్పేవారు.

IHG's Racha – <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=CHIRANJEEVI' target='_blank' title='chiranjeevi-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>chiranjeevi</a> <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=PAWAN' target='_blank' title='pawan-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>pawan</a> ...

 

పసివాడి ప్రాణం, యముడికి మొగుడు, అత్తకుయముడు అమ్మాయికి మొగుడు, గ్యాంగ్ లీడర్, రౌడీ అల్లుడు, ఘరానా మొగుడు, ముఠామేస్త్రి.. ఇలా ఒక సినిమా అని కాకుండా ప్రతి సినిమాలో వీరిద్దరి ఆటా – పాటా అలరించాయి. స్లో సాంగ్స్ పాడాలన్నా చిరంజీవికి సూట్ అయ్యేట్టే పాడేవారు బాలు. చిరంజీవి తన సింపుల్ ఎక్స్ ప్రెషన్స్ తో పాటకు అందం తీసుకొచ్చేవారు. ఇలా వీరిద్దరి ప్రతిభకు ఒకరికొకరు నువ్వా – నేనా అనేట్టుగా అలరించాయి.  

IHG

 

మరింత సమాచారం తెలుసుకోండి: