పవన్ కళ్యాణ్ పేరు వింటేనే తన అభిమానుల నరనరాల్లో కరెంట్ పాస్ అవుతుంది. కేవలం తాను వెండితెరకు మాత్రమే హీరో కాదని నిజ జీవితంలో కూడా హీరోనే అని అందరికీ తెలిసిన విషయమే. పవర్ స్టార్ మల్టీ టాలెంటెడ్ నటుడని అనేక సినిమాలలో రుజువయ్యింది. అద్భుతమైన నటన ప్రతిభ ఉండటంతోపాటు తనకి బంగారం లాంటి వ్యక్తిత్వం ఉంది. పవన్ కళ్యాణ్ తన సినీ కెరీర్ మొదటి లో బ్లాక్ బస్టర్ చిత్రాలను వరుసగా అందుకొని ఎంతో ఖ్యాతిని సంపాదించాడు. అప్పట్లో పవన్ కళ్యాణ్ స్టైల్, మేనరిజం ఒక ట్రెండ్ సెట్ చేసింది. తొలిప్రేమ తమ్ముడు సుస్వాగతం లాంటి ప్రేమ కథా చిత్రాలతో యువతను ఉర్రూతలూగించాడు పవన్ కళ్యాణ్. అప్పుడే కాదు ఇప్పటికీ పవన్ కళ్యాణ్ సినిమాలు అంటే లక్షల మంది అభిమానులు చెవి కోసుకొంటారు. 


గతంలో పవన్ కళ్యాణ్ జానీ సినిమాకి దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రం పవన్ కళ్యాణ్ సినీ కెరియర్ లోనే అతి పెద్ద డిజాస్టర్ గా మిగిలిపోయింది. ఇంకో విశేషం ఏమిటంటే ఈ చిత్రానికి కథను కూడా పవన్ కళ్యాణ్ నే అందించాడు. ఐతే జానీ సినిమా అట్టర్ ఫ్లాప్ అయినప్పటికీ పవన్ కళ్యాణ్ కు మాత్రం ప్రత్యేకమైన గుర్తింపు లభించింది. కొన్ని వారాల క్రితం పవన్ కళ్యాణ్ జానీ సినిమా 17 సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగా... తన అభిమానులు సోషల్ మీడియాలో జానీ సినిమాకు సంబంధించిన ఫోటోలను వీడియోలను పోస్ట్ చేసి నెట్టింట తుఫాను సృష్టించారు.

 

నిజానికి అట్టర్ ప్లాప్ అయిన సినిమా 17వ యానివర్సరీ ని కూడా చాలా గొప్పగా పవన్ కళ్యాణ్ అభిమానులు సెలబ్రేట్ చేసుకున్నారంటే పవన్ క్రేజ్ ఎంతగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న వకీల్ సాబ్ చిత్రంపై కూడా పవన్ కళ్యాణ్ అభిమానులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ రీల్ హీరోగా అస్సలు ఫెయిల్యూర్ అవ్వడు.

మరింత సమాచారం తెలుసుకోండి: