గాయకుడిగా భారతీయ వెండితెర మీద తిరుగులేని వ్యక్తి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం. ఎన్నో అద్భుత చిత్రాలకు తన గాత్రంతో ఊతమిచ్చిన ఈ మహా గాయకుడు డబ్బింగ్ ఆర్టిస్ట్ ‌గానూ ఎంతో పేరు పొందాడు. ముఖ్యం గా కమల్ హాసన్ ‌కు దాదాపు అన్ని చిత్రాలకు ఎస్పీ నే గాత్ర మందిస్తుంటారు. ముఖ్యంగా దశావతారం లాంటి సినిమాలో సగానికి పైగా పాత్రలకు ఎస్పీ డబ్బింగ్ చెప్పగా మిగతా పాత్రలకు కమల్ స్వయంగా డబ్బింగ్ చెప్పుకున్నాడు.

 

అంతే కాదు అతడు సినిమాలో నాజర్ పోషించిన తాత పాత్ర ఆ స్థాయి లో సక్సెస్‌ అయ్యిందటే దానికి వెనక ఎస్సీ గాత్ర మహిమ కూడా అంతో ఇంతో ఖచ్చితంగా ఉంది. ఇక అన్నమయ్య సినిమా వేంకటేశ్వర స్వామి పాత్రలో నటించిన సుమన్‌ కు ఎస్పీ చెప్పిన డబ్బింగ్ వింటే ఏడు కొండటవాడే స్వయంగా దిగి వచ్చి మాట్లాడుతున్నాడా అనిపించక మానదు. అలా ఎన్నో పాత్రకు తనదైన స్టైల్‌ లో డబ్బింగ్ చెప్పి ఆ పాత్రకు జీవం పోశాడు ఎస్పీ.

 

అయితే ఆయన జీవితం లో మరో మైలు రాయి లాంటి సినిమా గాంధీ. అంతర్జాతీయ స్థాయిలో రూపొందించి ఎన్నో ఇంటర్ ‌నేషనల్‌ ఫిలిం ఫెస్టివల్స్ ‌లో అవార్డు లను సైతం సాధించిన అద్భుత చిత్రం గాంధీ. దాదాపు ప్రపంచ దేశాల్లోన్ని అన్ని భాషల్లో ఈ సినిమాను డబ్బింగ్ చేశారు. అలాగే తెలుగులోకి డబ్బింగ్ చేశారు. అయితే తెలుగు లో బెన్‌ కింగ్ ‌స్లే పోషించిన గాందీ పాత్రకు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం డబ్బింగ్ చెప్పటం విశేషం. హాలీవుడ్ ప్రముఖలు రూపొదించిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులకు చేరువ అవ్వటం వెనుకగా ఎస్పీ గాత్ర మహిమ కూడా ఎంతో ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: