ప్రభాస్ సినిమా అనగానే జనాలకు ఉండే ఆసక్తి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మ‌నోడి సినిమా వస్తుంది అంటే చాలు థియేట‌ర్లు జ‌నాల‌తో షేక్ అవుతాయి. ఫ‌స్ట్ షో చూసేందుకు అర్ధరాత్రి నుంచే థియేట‌ర్ల వ‌ద్ద ప‌డిగాపులు కాచే అభిమానులు కూడా ఉన్నారు. బాహుబ‌లి సినిమా త‌ర్వాత ప్ర‌భాస్ రేంజ్‌, క్రేజ్ ఎలా పెరిగిపోయిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఇక ఇప్పుడు ప్రభాస్ సినిమాలకు కమర్షియల్ అనే గుర్తింపు రావడంతో బాబుతో సినిమా చేయడానికి చాలా మంది అగ్ర నిర్మాతలు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు ప్రభాస్ తీరు మాత్రం కాస్త చికాకుగా మారింది అన్న గుస‌గుస‌లు ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో వినిపిస్తున్నాయి.

 

ఇది నిజ‌మా ? అన్న ప్ర‌శ్న‌కు అవును ప్రభాస్ తీరుతో కొందరు నిర్మాతలు బాగా ఇబ్బంది పడుతున్నారు అని సినీ వర్గాలు అంటున్నాయి. బాహుబలి సినిమా సమయంలో ప్రభాస్ ఒక నిర్మాతకు మాట ఇచ్చినట్టు సమాచారం. సదరు నిర్మాతతో సినిమా చేస్తా అని ప్రభాస్ ఇటీవల కూడా చెప్పాడు. రాధాక్రిష్ణ తర్వాత మీతోనే సినిమా అని చెప్పాడట. కాని ఇది ముందుకి వెళ్ళే పరిస్థితి కనపడట లేదు. 

 

ఇటీవల ప్రభాస్ నాగ్ అశ్విన్ తో ఒక సినిమా ఓకే చేసాడు. దానికి కారణం ఏంటో అర్ధం కాక నిర్మాత ప్ర‌భాస్ స‌న్నిహితుల‌ను అడిగితే ప్రభాస్ చిన్న బడ్జెట్ సినిమాలు చేయడం లేదు అని అతనికి అసలు వరుసగా సినిమాలను విడుదల చేసే ఉద్దేశం కూడా లేదు అని చెప్పారట. అతను ఇప్పుడు తెలుగులో ఉన్న ఆఫర్లు చేసి తర్వాత బాలీవుడ్ కి వెళ్ళిపోయే ఆలోచనలో ఉన్నాడు అని చెప్పారట. మరి ఎంత వరకు నిజమో... ?

మరింత సమాచారం తెలుసుకోండి: