టీవీ షో కి జడ్జి అంటే ఇప్పుడు చాలా చులకన అయింది గాని దాదాపు పదేళ్ళ క్రితం అయితే పరిస్థితి చాలా భిన్నంగా ఉండేది. అవును టీవీ షో కి జడ్జ్ గా వ్యవహరించడం అనేది సాధారణ విషయం కాదు అనే విషయం చాలా మందికి ఈ తరం వాళ్లకు తెలియదు. కామెడి షో లు చూసి అదే అనుకుంటూ ఉంటారు. కాని కిందటి తరంలో ఎక్కువగా కొన్ని కొన్ని ఉండేవి. అది ఈ తరానికి పెద్దగా తెలియదు ఏమో గాని అది చాలా కష్టమైనా జాబ్ కూడా. ఇక ఎస్పీ బాలు విషయానికి వస్తే ఆయన సంగీత కార్యక్రమాలకు ఎక్కువగా జడ్జ్ గా వ్యవహరించారు. 

 

ఈటీవి లో వచ్చే పాడుతా తీయగా అనే కార్యక్రమానికి ఆయన వ్యవహరించారు. అసలు ఆ కార్యక్రమం మొదలు పెట్టిందే ఆయన కోసం అనే విధంగా ఆ కార్యక్రమం ముందు నుంచి చివరి వరకు జరిగింది. ఆ కార్యక్రమంలో బాలు ఉన్నారు కాబట్టే చాలా మంది దశాబ్దాలు గా చూసారు. ఈటీవి యాజమాన్యం కూడా ఆయన నుంచి చాలా నేర్చుకుంది. ఇక చాలా చానల్స్ ఆయనను చూసి పెట్టాలి అనుకున్నా సరే పాడుతా తీయగా అనే కార్యక్రమం సాధించిన విజయం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఇప్పుడు తెలుగులో పాడుతున్న ఎందరో గాయకులూ అక్కడి నుంచి వచ్చిన వారే కావడం గమనార్హం. 

 

ప్రతీ ఒక్కరు కూడా అందులో సంగీతం నేర్చుకున్న వారే. ఎస్పీ బాలు నుంచి నేర్చుకుని అంతర్జాతీయ వేదికల మీద పాడిన వాళ్ళు కూడా ఉన్నారు అని చెప్పవచ్చు. ఎందరో చిన్నారులకు ఆయన సంగీతంలో ఎన్నో నేర్పించారు. ఆ కార్యక్రమం ఇప్పుడు టీవీ లో వచ్చినా సరే ప్రేక్షకులు మిస్ కాకుండా చూస్తారు అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: