ఇప్పుడు సీనియర్ హీరోయిన్ లకు తెలుగులో డిమాండ్ క్రమంగా తగ్గుతోంది. యువ హీరోయిన్ ల హవా మొదలు కావడంతో సీనియర్ హీరోయిన్ లను ఎవరూ కూడా పట్టించుకునే వాతావరణం తెలుగులో లేదు అనే చెప్పాలి. అగ్ర హీరోయిన్ గా ఉన్నా చిన్న హీరోయిన్ గా ఉన్నా సరే ఇప్పుడు ఇదే పరిస్థితి ఉంది తెలుగులో అనే విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. అందుకే ఇప్పుడు మన తెలుగులో కొందరు హీరోయిన్ లు తప్పుకునే ఆలోచనలో ఉన్నారట. 

 

దాదాపు ప‌ది ప‌దిహేనేళ్ల‌కు పైగా ఇండ‌స్ట్రీలో ఉంటూ ఏదో ర‌కంగా నెట్ట‌కు వ‌స్తోన్న కొంద‌రు హీరోయిన్ల‌కు ఇప్పుడు ఛాన్సులు లేక గ‌డ్డు ప‌రిస్తితులు త‌ప్ప‌డం లేదు. ఈ క్ర‌మంలోనే సీనియ‌ర్ హీరోయిన్లు అయిన అనుష్కతో పాటుగా కాజల్ తప్పుకోవడానికి సిద్దంగా ఉన్నారు అని సమాచారం. వాళ్ళు ఇద్దరూ కూడా ఇప్పుడు తెలుగులో సినిమాలు చేయవద్దు అని ఒక నిర్ణయానికి వచ్చినట్టు టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఇక ఇది పక్కన పెడితే ఇప్పుడు ఒక వార్త టాలీవుడ్ లో చక్కర్లు కొడుతుంది. 

 

అనుష్క సినిమాల విషయంలో వెనక్కు తగ్గింది అని... సమంతా మాదిరిగా పెళ్లి చేసుకుని సైలెంట్ గా ఉండి ఆఫర్లు వస్తే మినహా సినిమాలు చేయవద్దు అని ఆమె నిర్ణయం తీసుకుంది అని అంటున్నారు. ఇదే విషయాన్ని ఇటీవల ఆమె సినిమా చెయ్యాలి అని అడిగిన ఒక యువ దర్శకుడికి చెప్పింది అని సమాచారం. సదరు యువ దర్శకుడికి ఆమెకు మంచి సంబంధాలు ఉన్నాయి. అందుకే ఆఫర్లు వస్తున్నా వద్దని చెప్తున్నట్టు సమాచార౦. ఇక కొద్ది రోజులుగా అనుష్క సినిమాలు రావ‌డం లేదు. నిశ్శ‌బ్దం ఎలా ?  ఎప్పుడు రిలీజ్ అవుతుందో ?  కూడా తెలియ‌ని ప‌రిస్థితి.

మరింత సమాచారం తెలుసుకోండి: