శేఖర్ మాస్టర్... ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ కొరియోగ్రాఫర్ గా కొనసాగుతున్న వ్యక్తి. శేఖర్ మాస్టర్ రూపొందించిన అలా వైకుంఠపురంలో సినిమాలో ఉన్న రాములో రాముల... పాటకి కొరియోగ్రఫీ చేసిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. ఈ సాంగ్ ప్రపంచవ్యాప్తంగా ఎంత ప్రాచుర్యం పొందిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చివరికి ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెట్ ప్లేయర్ డేవిడ్ వార్నర్ కూడా ఈ సాంగ్ కు ఫిదా అయ్యి టిక్ టాక్ ద్వారా తన డాన్స్ స్కిల్ ని బయట పెట్టాడు. ఆ వీడియో కి తెలుగు ప్రేక్షకుల నుంచి అనేక అభినందనలు తెలియజేశారు. చివరికి ఆ సినిమాలో హీరోగా నటించిన అల్లు అర్జున్ కూడా ఆ వీడియో రిప్లై ఇచ్చి అభినందించాడు.  


ఇకపోతే తాజాగా ఈ పాటకు కొరియోగ్రఫీ చేసిన శేఖర్ మాస్టర్ తన తనయుడు తో కలిసి స్టెప్స్ వేయడం జరిగింది. వీరిద్దరు కలిసిన వీడియోని శేఖర్ మాస్టర్ తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ ద్వారా పోస్ట్ చేయడం జరిగింది. నిజంగా ఆ వీడియోలో తండ్రీకొడుకులు ఒకరి నుంచి ఒకరు పోటీపోటీగా డాన్స్ చేశారు. మీ అందరి కోసం ఈ వీడియోని ఒకసారి చూసి ఎంజాయ్ చేయండి.

 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

Saradhaga vinny tho #ramulooramulaa @alluarjunonline

A post shared by sekhar Master (@sekharmaster) on

 

మరింత సమాచారం తెలుసుకోండి: