సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా రాణించాలి అని అనుకునే వాళ్ళు కచ్చితంగా మంచి బ్యానర్ లో అదే రీతిలో స్టార్ హీరో పక్కన క్రేజ్ కలిగి భవిష్యత్ ఉన్న హీరో తో సినిమా చేయాలనుకుంటారు. ఎవరికి వారు తమ కెరియర్ కోసం చాలా జాగ్రత్తగా సినిమా ప్రాజెక్టు ఒప్పుకునే విషయం లో హీరోయిన్లు అనేక లెక్కలు బేరీజు వేసుకుంటారు. అటువంటిది ఇటీవల సాయి పల్లవి కి ఇండస్ట్రీలో మిడిల్ ఏజ్ హీరో పక్కన సినిమా చేయాలని డైరెక్టర్ తేజ దర్శకత్వంలో ఆఫర్ వచ్చాక సినిమా చేయని మొహం మీద చెప్పేసిందట.

IHG's attitude problems re-surface once again

పూర్తి మేటర్ లోకి వెళ్తే డైరెక్టర్ తేజ లేటెస్ట్ ప్రాజెక్ట్ గోపీచంద్ తో అలిమేలు (సమేత) వెంకటరమణ సినిమా కోసం సాయి పల్లవి ని ఎంపిక చేయాలని అనుకున్నారట. దానికి సాయి పల్లవి నో చెప్పినట్లు ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మామూలుగానే తేజ అంటే హీరోయిన్లు అంత సులువుగా ఓకే అన్నారు. అటువంటిది ఫుల్లు ఫ్లాపుల్లో ఉన్న హీరో పైగా తన ఏజ్ కంటే గోపీచంద్ ఏజ్ చాలా ఎక్కువ కావడంతో హీరోయిన్ సాయి పల్లవి నో చెప్పినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. దీంతో డైరెక్టర్ తేజ మరో హీరోయిన్ ని సెలెక్ట్ చేయడానికి రెడీ అవుతున్నారట.

IHG

మరోపక్క ఈ వార్తల్లో వాస్తవం ఉందో లేదో తెలియదు కానీ సోషల్ మీడియాలో రావడంతో గోపీచంద్ ఫ్యాన్స్ అసలు నువ్వు మా వాడి పక్కన నటించడానికి అర్హత లేదని సాయిపల్లవి పై సీరియస్ అవుతున్నారట. మా వాడి హైటెక్ కి  బాడీ కి హీరోయిన్ గా కాదు కదా సైడ్ క్యారెక్టర్ కి కూడా పనికి రావని సెటైర్లు వేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: