మన తెలుగులో యాంకర్లకు మంచి డిమాండ్ అనేది వచ్చింది. వాళ్లకు ఇప్పుడు మంచి మంచి ఆఫర్లు వస్తున్న సంగతి తెలిసిందే. అగ్ర హీరోల సినిమాల్లో కూడా వాళ్ళను తీసుకునే ప్రయత్నాలను చేస్తున్నారు. అగ్ర హీరోలు అయినా చిన్న హీరోలు అయినా సరే ఇప్పుడు యాంకర్లకు సోషల్ మీడియాలో ఉన్న క్రేజ్ ని వాడుకోవాలి అని భావిస్తున్నారు అనేది కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు సినిమాల నిర్మాణ ఖర్చులు సహా ఇతర ఖర్చులను తగ్గించుకునే ఆలోచనలో ఉన్న టాలీవుడ్ జనాలు ఇప్పుడు కొన్ని కొన్ని నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తుంది. 

 

యాంకర్లను సినిమాల్లోకి తీసుకుంటే మంచి లాభం ఉంటుంది అని వాళ్ళు సోషల్ మీడియాలో బాగా ప్రమోట్ చేస్తారు అని భావిస్తున్నట్టు సమాచారం. అగ్ర హీరోలు అయినా చిన్న హీరోలు అయినా సరే ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది అని తక్కువ బడ్జెట్ తో చేసే సినిమాలకు వాళ్ళ అవసరం అనేది ఇప్పుడు చాలా ఉంది అని భావిస్తున్నారట. నానీ లాంటి హీరోల సినిమాల ప్రచారానికి వాళ్ళను వాడుకుంటే మంచి ఫలితం ఉంటుంది అని భావిస్తున్నారు. అగ్ర హీరోలు కూడా ఇదే విధంగా ఆలోచనలో ఉన్నారు అని అంటున్నారు. 

 

పెద్ద హీరోల సినిమాలకు కూడా వాళ్ళ అవసర౦ అనేది ఇప్పుడు ఉంది అనే ప్రచారం జరుగుతుంది. మరి భవిష్యత్తు లో వాళ్ళు ఏయే హీరోల సినిమాల్లో నటించే అవకాశం ఉంది అనేది చూడాలి. చిరంజీవి సినిమాలో అనసూయ కూడా నటించే అవకాశం ఉంది అని సమాచారం. ఆమెను ఇప్పటికే అడిగారు అని తెలుస్తుంది. ఇక పుష్ప సినిమాలో కూడా ఆమె నటించడం దాదాపుగా ఖాయమైంది అని సమాచారం. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన కూడా వచ్చే సూచనలు ఉన్నాయి అని టాలీవుడ్ లో టాక్. మరి ఆమె ఏ విధంగా నటిస్తుంది అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: