ఇప్పుడు భారీగా పెట్టుబడులు పెట్టి సినిమాలు చేయడం అనేది అంత సులభం కాదు అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న హీరోల సినిమాలకు కూడా బడ్జెట్ ని తగ్గించుకునే ప్రయత్నాలను ఎక్కువగా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు చిన్న హీరోలు అయినా పెద్ద హీరోలు అయినా సరే చాలా తక్కువకే సినిమాలను పూర్తి చేసే ప్రయత్నాలను దాదాపుగా చేస్తున్నారు. ఇక సినిమాల విషయంలో ఇప్పుడు ఆవేశ పడి ఎక్కువగా పెట్టుబడి పెడితే మాత్రం నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 

 

అందుకే చిరంజీవి రామ్ చరణ్ కి కీలక సూచనలు చేసినట్టు వార్తలు వస్తున్నాయి. అనవసరంగా పెట్టుబడులు ఆవేశ పడి పెట్టవద్దు అని కుదిరితే కథ బాగుండే చిన్న చిన్న సినిమాలను కొనాలి అని ఆయన సూచనలు చేసినట్టు సమాచారం. తనతో చేసే సినిమాలు అయినా సరే అదే విధంగా వ్యవహరించడం మంచిది అని చిరంజీవి చెప్పినట్టు టాలీవుడ్ లో ఇప్పుడు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. నష్టాలను ఎదుర్కోవడం అనేది  సులభం అవుతుంది అని చెప్పారట. అగ్ర హీరోల సినిమాల విషయంలో నిర్మాతగా వెళ్ళవద్దు అని చెప్పెసినట్టు తెలుస్తుంది. 

 

ఇక తన సినిమాలకు కూడా భారీగా పెట్టుబడి వద్దు అని చెప్పారట చిరంజీవి. మరి నిజమా కాదా అనేది తెలియదు గాని రామ్ చరణ్ మాత్రం ఇప్పుడు కొన్ని కొన్ని సినిమాలను కొనాలి అని చూసి కూడా వెనక్కు తగ్గినట్టు టాలీవుడ్ లో ప్రచారం మాత్రం జరుగుతుంది. భవిష్యత్తు లో సినిమాల పరిస్థితి దారుణంగా ఉంటుంది కాబట్టి కొనడం అనే విషయంలో పెట్టుబడి పెట్టడం అనే విషయంలో ఒకటికి వంద సార్లు ఆలోచన చెయ్యాలి అని చెప్పారట చిరంజీవి. అందుకే రామ్ చరణ్ ఇప్పుడు ఆలోచనలో పడినట్టు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: