డైరెక్టర్ రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో సినిమా వస్తుందంటే ఒకప్పుడు ఆ సినిమా కోసం ఎంతగానో ఆతృతగా ఎదురు చూసేవారు. కానీ ప్రజెంట్ పరిస్థితి మాది వర్మ తీస్తున్నాడు అంటే పెద్దగా పట్టించుకున్న దాఖలాలు కూడా లేకుండా పోయాయి. ఇదిలా ఉండగా ఇటీవల లాక్ డౌన్ టైం లో ఇండస్ట్రీ అంతా ఇంటికి పరిమితమైన సమయంలో కరోనా వైరస్ పై సినిమా తీసి అందరికీ ఒక్కసారిగా షాక్ ఇచ్చాడు. ఇంటిలోనే ఉంటూ అందుబాటులో ఉన్న టెక్నాలజీతో తెరకెక్కించిన కరోనా వైరస్ త్వరలోనే సినిమా రిలీజ్ చేయడం కోసం ఏర్పాట్లు చేస్తున్నారట.

IHG

ఎప్పటికప్పుడు తాజా పరిస్థితులపై సినిమాలు తీస్తున్న రామ్ గోపాల్ వర్మ తన పాత టచ్ హర్రర్ నేపథ్యంలో సినిమాలు చేసి చాలా కాలం అయ్యింది. తాజాగా రామ్ గోపాల్ వర్మ ఆ తరహాలో సినిమా చేయాలని మరొక సంచలన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రామ్ గోపాల్ వర్మ పూర్తిస్థాయి హర్రర్ సినిమా చేస్తున్నట్లు తెలిపారు.

IHG

అంతేకాకుండా పాతిక సంవత్సరాల క్రితం వచ్చిన దెయ్యం సినిమా సీక్వెల్ గా భయం అనే సినిమా చేయబోతున్నట్లు గా వర్మ సంచలన విషయాన్ని ప్రకటించారు. రామ్ గోపాల్ వర్మ కెరియర్ ని మరో స్థాయికి తీసుకెళ్లింది దెయ్యం అనే సినిమా. 1996 లో రిలీజ్ అయిన ఈ సినిమా అప్పట్లో హాలీవుడ్ రేంజ్ లో తెలుగు ప్రేక్షకులను అలరించింది. తాజాగా మళ్లీ ఆ సబ్జెక్ట్ ని రాంగోపాల్ వర్మ టచ్ చేయబోతున్నట్లు చెప్పడంతో ఈ సినిమాపై ఇండస్ట్రీలో ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: