కరోనా వైరస్ అనే మహమ్మారి ప్రపంచం లోకి ఎంటర్ కావటంతో లాక్ డౌన్ అమలు చేయడం వలన దేశవ్యాప్తంగా అన్ని సినిమా షూటింగులు థియేటర్లు క్లోజ్ అయిన విషయం అందరికి తెలిసిందే. ఈ పరిస్థితి ముఖ్యంగా వేసవికాలంలో రావడంతో పైగా మంచి సీజన్ కావడంతో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి ఈ సీజన్ భయంకరమైన కష్టాలు నష్టాలు మిగిల్చింది. కాగా ఇటీవల లాక్ డౌన్ తర్వాత చాలావరకు సడలింపులు కొన్ని వాటిపై ఆంక్షలు ఎత్తివేస్తూన్నా సినిమా ఇండస్ట్రీ పై మాత్రం ఆంక్షల విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. ఇటువంటి టైం లో టాలీవుడ్ ఇండస్ట్రీ ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ అతి త్వరలో సినిమా షూటింగ్స్ కి సంబందించిన మార్గదర్శకాలను రిలీజ్ చేసి, షూటింగ్స్ కి అనుమతి ఇవ్వనున్నారని’ తెలిపారు.

IHG

పరిమిత సంఖ్యలో షూటింగ్ సభ్యులు ఉండాలని ప్రభుత్వాలు మార్గదర్శకాలు రిలీజ్ చేసే అవకాశం ఉండటంతో అందుకు డైరెక్టర్స్ కూడా ఓకే అని చెప్పటంతో ముందుగా సినిమాకి సంబంధించి చివరి దశలో షూటింగ్స్ బ్యాలెన్స్ ఉన్నవి మొదలు కానున్నట్టు సమాచారం. ఇదిలా ఉండగా ఇంక థియేటర్స్ విషయానికి వస్తే మరో మూడు నెలల పాటు ఓపెన్ అయ్యే అవకాశం లేదని కేంద్ర మంత్రి జవదేకర్ ఇటీవల వ్యాఖ్యలు చేసిన వాటిని బట్టి తెలుస్తోంది. ఆయన  సినిమా థియేటర్స్ ఓపెనింగ్స్ గురించి మాట్లాడుతూ థియేటర్స్ రీ ఓపెనింగ్ ఇప్పుడప్పుడే జరిగే పని కాదని జూన్ నెలలో నమోదయ్యే కోవిడ్ పాజిటివ్ కేసుల్ని బట్టి, అప్పటి పరిస్థితులను పూర్తిగా సమీక్షించిన తర్వాత థియేటర్స్ ఓపెనింగ్ విషయం చర్చిస్తాం.

IHG

జూన్ లో అయితే థియేటర్స్ గురించి ఆలోచించడం లేదని’ అన్నారు. ఈ విషయం నడుస్తూ ఉండగానే మరొకపక్క ఒకవేళ సినిమా థియేటర్స్ ఓపెన్ అయినా ఆన్లైన్ లో టికెట్ తీసుకున్న తర్వాత షో స్టార్ట్ రెండు గంటలకు ముందే రావాలంట. అంతేకాకుండా థియేటర్లో ప్రవేశించక ముందు కూడా కొన్ని పరీక్షలు చేసి అప్పుడు లోనికి పంపిస్తారు అంట. థియేటర్లో కూడా సీటు కి సీటు కి మధ్య గ్యాప్ ఉండేలా సినిమా థియేటర్ల యాజమాన్యాలు ఏరేంజ్ చేయబోతున్నారట. దీంతో భవిష్యత్తులో రిలాక్సేషన్ కోసం సినిమా కి వెళ్లాలనుకున్నా అక్కడ కూడా భయం నెలకొన్న పరిస్థితులు కరోనా వైరస్ వల్ల దాపురించాయి అని చెప్పవచ్చు.  

మరింత సమాచారం తెలుసుకోండి: