సుకుమార్ సినిమాలను చేయడం అంత ఈజీ కాదు అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన సినిమాలు చెయ్యాలి అంటే కచ్చితంగా ధైర్యం ఉండాలి ముందు. ఆయన ఎంచుకునే కథలు ఆ సినిమా చేసే విధానం అన్నీ కూడా ఒక సంచలనం. ప్రతీ ఒక్కటి కూడా ఆయనతో సినిమా చేసే ముందు ఒకటికి వంద సార్లు ఆలోచించే పరిస్థితి ఉంటుంది. ఇక ఇప్పుడు ఆయన అల్లు అర్జున్ తో ఒక సినిమా చేస్తున్నాడు. పుష్ప అనే టైటిల్ తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ సినిమాలో  ఇప్పుడు కొన్ని కొన్ని సన్నివేశాలు సంబంధించి మార్పులు చేస్తున్నారు. 

 

ఇక ఇది పక్కన పెడితే ఇప్పుడు ఒక వార్త బయటకు వచ్చింది. ఈ సినిమాలో బన్నీ కి సంబంధించి కొన్ని కొన్ని కీలక మార్పులను చెయ్యాలి అని భావిస్తున్నాడు సుకుమార్. వాస్తవానికి డూప్ తో ముందు కొన్ని కొన్ని సన్నివేశాలను చెయ్యాలి అని సుకుమార్ భావించి ప్రయత్నాలు కూడా చేసారు. అయితే అది ఆ తర్వాత వద్దు అని బన్నీ చెప్పడంతో వెనక్కు తగ్గారు. ఇప్పుడు మళ్ళీ దాన్ని సెట్స్ మీద పెట్టాలి అని భావిస్తున్నారు. కథకు తగిన విధంగా తనను తాను మార్చుకుంటా అని తనకు ఏ ఇబ్బంది లేదని బన్నీ చెప్పారట. 

 

బన్నీ నుంచి స్పష్టమైన హామీ సుకుమార్ కి రావడం తో ఆయన కూడా ఇప్పుడు కథను బన్నీ కి తగిన విధంగా మార్చి కొన్ని కొన్ని సన్నివేశాలు కష్టమైనా సరే షూట్ చెయ్యాలి అని భావిస్తున్నారు అని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఈ సినిమాలో కొందరు కీలక నటులకు సంబంధించి ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి. ఈ సినిమాను వచ్చే ఏడాది చివర్లో విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి అని టాలీవుడ్ లో టాక్.

మరింత సమాచారం తెలుసుకోండి: