టాలీవుడ్ లో ఇప్పుడు త్రివిక్రమ్ కి ఉన్న డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన తో సినిమా చెయ్యాలి అనుకునే స్టార్ హీరోల సంఖ్య ఎక్కువగానే ఉంది మన తెలుగులో. ఆయన తో ఒక్క సినిమా చేసినా సరే చాలు అనుకునే వారు ఉన్నారు. ఇక ఆయన మాత్రం చాలా జాగ్రత్తగా ఏడాదికి రెండేళ్లకు ఒక సినిమా చేస్తున్నారు. ఇప్పుడు ఆయన పూర్తిగా బీజీ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. ఆయన రాబోయే రోజుల్లో అన్నీ కూడా అగ్ర హీరోల సినిమాలనే ఎక్కువగా చేస్తున్నారు. చిన్న హీరోలకు ఆయన దొరికే అవకాశం లేదు. 

 

ఇక ఇప్పుడు ఆయనతో సినిమా చేయడానికి గానూ రామ్ చరణ్ ఆసక్తి చూపిస్తున్నట్టు సమాచారం. ఎప్పటి నుంచో రామ్ చరణ్ సినిమా చెయ్యాలి అనే ప్రయత్నాలను ఎక్కువగా చేస్తున్నారు. త్రివిక్రమ్ కు కూడా రామ్ చరణ్ తో సినిమా చెయ్యాలి అని ఉన్నా సరే సమయం దొరకక వెనకడుగు వేసే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు మాత్రం ఏది ఏమైనా సరే రామ్ చరణ్ తో సినిమా చెయ్యాలి అని త్రివిక్రమ్ ఓకే చెప్పినట్టు వార్తలు వస్తున్నాయి. ఆర్ఆర్ఆర్ సినిమా పూర్తి అయిన తర్వాత ఈ ప్రాజెక్ట్ ని పట్టాలు ఎక్కించే అవకాశాలు ఉన్నాయని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. 

 

ఈ ప్రాజెక్ట్ ని సెట్స్ మీదకు తీసుకు వెళ్ళే విషయంలో త్రివిక్రమ్ రెడీ అని అయితే ఎన్టీఆర్ సినిమా ఉండటం తో కథ రెడీ చేయడంలో కాస్త ఆలస్యం అయ్యే అవకాశం ఉంది అని సమాచారం. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి ఒక అధికారిక ప్రకటన కూడా వస్తుంది అని టాలీవుడ్ లో జనాలు అంటున్నారు. మరి ఈ సినిమాను ఎప్పుడు మొదలు పెట్టి ఎప్పుడు విడుదల చేస్తారు అనేది చూడాలి. ప్రస్తుతం ఆర్ఆర్అర షూటింగ్ లో రామ్ చరణ్ ఫుల్ బిజీ...

మరింత సమాచారం తెలుసుకోండి: