టాలీవుడ్ లో ఒక వెలుగు వెలిగిన హీరోయిన్స్ లో ఇలియానా ఒకటి. అగ్ర హీరోలు అందరి తో ఆమె దాదాపుగా సినిమాలు చేసింది అని చెప్పవచ్చు. అయితే ఇప్పుడు మాత్రం ఆమె ఒక్క అవకాశం వచ్చినా సరే చాలు అనుకునే పరిస్థితి ఏర్పడింది. దాదాపు ఆమె సినిమాల్లోకి వచ్చి పదేళ్ళు అయింది. అయితే ఆమెకు యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉన్నా సరే ఆమెకు మాత్రం సినిమాల్లో అవకాశాలు మాత్రం పెద్దగా రావడం లేదు. దీనితో ఆమె ఇప్పుడు సినిమాల్లో అవకాశాల కోసం తీవ్రంగా ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. అయిన అసారే ఆమెను ఎవరు కూడా సినిమాల్లోకి తీసుకోవడం లేదు. 

 

ఇక ఇప్పుడు ఆమె సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలుసుకున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆమెకు అవకాశం ఇవ్వాలి అని భావిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఆమె పవన్ తో కలిసి జల్సా సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా మంచి విజయం సాధించడం తో ఆమెకు కూడా మంచి పేరు వచ్చింది. ఇక అక్కడి నుంచి ఆమెకు వరుస ఆఫర్లు వచ్చినా సరే ఆమె మాత్రం వచ్చిన క్రేజ్ ని దాదాపుగా నిలబెట్టుకోలేదు అని చెప్పవచ్చు. ఇప్పుడు క్రిష్ తో చేసే సినిమాలో ఆమెకు అవకాశం ఇవ్వడానికి పవన్ ముందుకు వచ్చారు. 

 

ఆమెకు ఇప్పటికే క్రిష్ నుంచి ఫోన్ కూడా వెళ్ళింది అని టాలీవుడ్ లో టాక్ వినపడుతుంది. ఎంత వరకు నిజం అనేది తెలియదు గాని ఆమెను మాత్రం త్వరలోనే తన సినిమాలో క్రిష్ తీసుకునే అవకాశం ఉంది అని అంటున్నారు. ఇక ఆమె కూడా ఇప్పుడు బరువు తగ్గే ప్రయత్నం చేస్తుందని అంటున్నారు. ఇక ఏది ఎలా ఉన్నా సరే క్రిష్ ఆమెను ఓకే చేసారు అనేది తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: