చిరంజీవి మెగాస్టార్ గా ఉన్నారు. బాలక్రిష్ణ నట సింహ. నాలుగున్నర దశాబ్దాల సినీ కెరీర్ ని పండించుకున్న నటరత్న. తండ్రి ఎన్టీయార్ నుంచి నటనను క్రమ శిక్షణను పుణికిపుచ్చుకున్న బాలయ్య తెలుగు సినీ టాప్ రేంజి హీరోల్లో ఒకరు.

 

ఇటీవల బాలయ్య సినిమా పెద్దల మీటింగునకు తనను పిలవలేదని ఆగ్రహించారు. ఆ సమయంలో ఆయన హాట్ హాట్ కామెంట్స్ కూడా చేశారు. ఇక బాలయ్య మీద నాగబాబు రివర్స్ అటాక్ చేశారు. దాని మీద బాలయ్య సైలెంట్ అవుతూనే మర్యాద ఎవరైనా తనకు ఇచ్చి పుచ్చుకోవాల్సిందేనని ఓ యూట్యూబ్ చానల్ ఇంటర్వ్యూలో కచ్చితంగా చెప్పేశారు.

 

తన రూట్ ఇదేనని, తాను ఎవరికీ భయపడను అంటూ గట్టిగానే అందరికీ సమాధానం ఒక్క మాటతో ఇచ్చారు. ఇక తెలుగు సినిమా రంగంలో బాలయ్య, చిరంజీవిల మధ్య మంచి స్నేహం ఉంది. ఇద్దరూ ఒకరిని ఒకరు గౌరవించుకుంటారు.  ఒకరి సినిమాలు మరొకరికి పోటీగా రిలీజ్ అయినా కూడా ఆ స్నేహం దెబ్బతినకుండానే కొనసాగుతోంది.

 

ఇవన్నీ ఇలా ఉంటే బాలయ్య మళ్ళీ చిరంజీవి మీద తన సినిమాను పోటీకి పెట్టాలి అనుకుంటున్నారుట. బాలయ్య, బోయపాటి కాంబినేషన్ లో వస్తున్న మోనార్క్ మూవీకి ఆచార్య మూవీకి మధ్య పోటీ ఉండేలా ఉంది. ఆచార్య కొరటాల శివ డైరెక్షన్లో వస్తోంది. ఇందులో చిరంజీవి పాత్ర కూడా బాగా డిజైన్ చేశారు.

 

ఈ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేద్దామనుకుంటున్నారు. అదే విధంగా బాలయ్య మూవీని కూడా సంక్రాంతికి రిలీజ్ చేయాలని ఆలోచిస్తున్నారుట. అంటే ఈ రెండు సినిమాల మధ్యన మరోమారు యుధ్ధం జరిగే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయని అంటున్నారు.

 

 2017లో వచ్చిన ఖైదీ నంబర్ 150, గౌతమి పుత్ర శాతకర్ణ మూవీల మధ్య గట్టి పోటీ ఎదురైంది. ఇపుడు కూడా అదే రకమైన పోటీ ఉంటుందని అంటున్నారు. ఎందుకో బాలయ్య సంక్రాంతికి బోయ‌పాటిని నమ్ముకుని మళ్ళీ వస్తున్నాడు. మరి చిరంజీవితో ఢీ కొడతాను అంటున్నాడు. చూడాలి ఈ పోటీ ఎలా ఉంటుందో. ఏం జరుగుతుందో.

మరింత సమాచారం తెలుసుకోండి: