ఇప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోలు అందరూ కూడా మంచి మంచి సినిమాలు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ అయినా పర్వాలేదు అనే విధంగా ఇప్పుడు అడుగులు వేస్తున్నారు. చిన్న హీరోలు పెద్ద హీరోలు అనే తేడా లేకుండా ఇప్పుడు భారీ బడ్జెట్ సినిమాల మీద ఎక్కువగా ఫోకస్ చేసారు. ఇక ఇప్పుడు కొందరు అగ్ర హీరోలకు ఇదే పెద్ద సమస్యగా మారింది అని సమాచారం. భారీ బడ్జెట్ సినిమాలు ఎవరు అయితే చెయ్యాలి అని భావిస్తున్నారో వాళ్ళు అందరిని కూడా ఇప్పుడు నిర్మాతలు పూర్తిగా పక్కన పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. 

 

అవును ఇప్పుడు వాళ్ళు అందరిని కూడా అవసరం లేదు అని చెప్తున్నారు. తాజాగా ఒక స్టార్ హీరో కి బడా నిర్మాత షాక్ ఇచ్చారు. భారీ బడ్జెట్ సినిమాలో పెట్టుబడి పెట్టడానికి గానూ తాను సిద్దంగా లేను అని చిన్న సినిమాలను మాత్రమే చేస్తా అని చెప్పారట.  ఆ హీరో కి ఎంత మార్కెట్ ఉన్నా సరే తనకు అవసరం లేదని తాను ఇప్పుడు పెట్టుబడి పెట్టేది లేదు అని చెప్పినట్టు సమాచారం. అదే హీరో కి మరో నిర్మాత కూడా అదే విషయం చెప్పినట్టు సమాచారం. మీరు స్థాయి తగ్గించుకోకపోతే మాత్రం మా వల్ల కాదని దయచేసి ఏమీ అనుకోవద్దు అని చెప్పారట. 

 

అగ్ర హీరోలు అయినా చిన్న హీరోలు అయినా సరే తాము ఇప్పుడు ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నామని అన్నారట. ఇక ప్రచార బాధ్యతలు కూడా మీరే మొయ్యాల్సి ఉంటుంది అని చెప్పినట్టు టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. అది ఎవరికి అయినా సరే వర్తిస్తుంది అని చెప్పారట.  అందుకు రెడీ అయితేనే సినిమా చెయ్యాలి అని లేకపోతే అవసరం లేదని ముఖం మీదే చెప్పినట్టు టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: