ప్రస్తుతం తెలుగులో ఉన్న స్టార్ హీరోయిన్ల లిస్టులో రష్మిక మందన మొదటి వరుసలో ఉంది. ఇంకా చెప్పాలంటే ఆమె తెలుగు సినిమాలకు లక్కీ ఐకాన్. తొలి సినిమా ఛలోతో హిట్ అందుకుని గీత గోవిందంతో స్టార్ హీరోయిన్ అయిపోయింది. విజయ్ తోనే చేసిన డియర్ కామ్రేడ్ సినిమాకు వచ్చిన హైప్ సగం రష్మిక వల్లనే అంటే అతిశయోక్తి లేదు. ప్రస్తుతం అమ్మడి హవా ఓ రేంజ్ లో ఉంది అనేకంటే.. రష్మిక చిన్నప్పుడే స్టార్ అనుకోవాలి. ఈ విషయాన్ని రుజువు చేస్తూ తన ఇన్ స్టా అకౌంట్ లో పోస్ట్ చేసింది.

IHG's ...

 

గోకులం అనే పిల్లల మ్యాగజైన్ కవర్ పేజీపై 2001లో ప్రచురితమైన తన ఫోటోను పోస్ట్ చేసింది. చిన్నప్పుడు ఎంత క్యూట్ గా ఉండేదో ఈ ఫొటో చూస్తేనే అర్దమవుతోంది. ‘ఈ మ్యాగజైన్ ను మా అమ్మ అప్పటి నుంచీ దాచుకుంది. ఇప్పటికీ నేను కనిపించే ఏ పత్రికనైనా ఇలానే దాచుకుంటుంది. ఆ ఫొటో దిగిన సంఘటన ఇప్పటికీ నాకు గుర్తుంది. ఈరోజు మీముందు ఇలా హీరోయిన్ గా ఉంటానని ఆరోజు అనుకోలేదు. ఇందుకు కారణమైన నా ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అంటే నాకెంతో ఇష్టం. ప్రస్తుత ప్రయాణంలో కూడా నేను పనిచేసే ప్రతి ఒక్కరినీ ప్రేమిస్తూనే ఉంటాను’ అంటూ సంబరపడిపోతూ చెప్పుకుంది.

IHG

 

రష్మిక పోస్ట్ చూసిన ఆమె ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. ‘నువ్వు చిన్నప్పుడు స్టార్ కిడ్.. ఇప్పుడు స్టార్ హీరోయిన్’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. రీసెంట్ గా సూపర్ స్టార్ మహేశ్ తో చేసిన సరిలేరు.. నీకెవ్వరు కూడా హిట్ అవడంతో రష్మిక రేంజ్ మరింత పెరిగిపోయింది. ప్రస్తుతం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా చేస్తున్న పుష్ప మూవీలో నటిస్తోంది. రామ్ చరణ్ తో ఆచార్యలో చేసే అవకాశం ఉందంటున్నారు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

This was 2001 and my first ever magazine cover! ♥️ I still remember doing the shoot that day! To this day, my mum has saved the magazine and she still saves every magazine now. Was I destined to be here today receiving all your love? I wonder. But I am glad this is my life and I wouldn’t trade it to anyone else’s. I love my family, the friends I’ve made, the things that have happened in my life, the people I work with, have worked with, and every war we’ve fought, every milestone we’ve reached. Ahhh sorry I am saying too much. But well Fun fact- showing off my finger since 2k1 yo! 🤷🏻‍♀️🐒

A post shared by rashmika Mandanna (@rashmika_mandanna) on

 

మరింత సమాచారం తెలుసుకోండి: