కరోనా తర్వాత సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తున్న మాటలు ఓటీటీ, వెబ్ సిరీస్. థియేటర్స్ మూతబడటంతో చాలామంది దృష్టి వీటిపై పడింది. యంగ్ హీరోహీరోయిన్లతో పాటు.. స్టార్స్ ను సైతం వెబ్ సిరీస్ ఎట్రాక్ట్ చేస్తోంది. స్టార్ డైరెక్టర్స్ కూడా వీళ్ల బాటలోనే పయనిస్తున్నారు. ఖాళీగా ఉన్నామని కొందరు.. సినిమా ఛాన్సుల్లేవని మరికొందరు వెబ్ సిరీస్ వైపు చూస్తున్నారు. 

 

మహర్షి సక్సెస్ తర్వాత దర్శకుడు వంశీ పైడిపల్లి మరోసారి మహేశ్ నే డైరెక్ట్ చేయాల్సి ఉంది. కాకపోతే.. కథ మహేశ్ కు నచ్చకపోవడంతో ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయింది. ఎవడు.. తర్వాత మరోసారి రామ్ చరణ్ తో ఓ ప్రాజెక్ట్ అనుకున్నా.. హీరో ఆర్ఆర్ఆర్.. ఆచార్యతో బిజీగా ఉండటంతో.. ఇప్పట్లో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నటించలేడు. 

 

చేతికొచ్చిన మహేశ్ సినిమా జారిపోవడం.. రామ్ చరణ్ ఇప్పట్లో డేట్స్ ఇవ్వలేకపోవడంతో.. వంశీపైడిపల్లి మనసు వెబ్ సిరీస్ వైపు మళ్లింది. అల్లు అరవింద్ నిర్వహిస్తున్న ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా కోసం వంసీ ఓ వెబ్ సిరీస్ చేయనున్నాడని తెలిసింది. 

 

గద్దలకొండ గణేశ్ తర్వాత హరీష్ పవన్ ను డైరెక్ట్ చేయనున్నాడు. అయితే ఇప్పట్లో ఈ కాంబినేషన్ మొదలుకాలేదు. పవన్ నటిస్తున్న రెండు సినిమాలు రిలీజ్ అయితే గానీ.. హరీశ్ శంకర్ మూవీ మొదలు కాదు. వకీల్ సాబ్ ఇంకా 10రోజుల షూటింగ్ బ్యాలెన్స్ ఉంది. ఆ తర్వాత క్రిష్ మూవీలో పవన్ జాయిన్ అవుతాడు. కరోనా పరిస్థితుల నేపథ్యంలో వకీల్ సాబ్ ఎప్పుడు రిలీజ్ అవుతుందో చూడాలి. 

 

పవన్, హరీశ్ సినిమా మొదలు కావడానికి ఏడాది పట్టేట్టు ఉంది. ఈ లోగా మరో చేయాలనుకోవడం లేదు దర్శకుడు. అయితే క్రిష్ తో కలిసి కొన్ని వెబ్ సిరీస్ లు ప్లాన్ చేస్తానని చెప్పాడు హరీష్. నిర్మాతగా ఉంటూనే అవసరమైతే దర్శకుడిగా మారనున్నాడు. ఇలా ఖాళీ లేకుండా బిజీ షెడ్యూల్ ప్లాన్ చేసుకున్నాడు హరీష్. 

మరింత సమాచారం తెలుసుకోండి: