ప్రపంచ వ్యాప్తంగా కరోనా ఎంతగా ప్రభావం చూపిస్తుందో అందరికి కళ్ళకు కట్టినట్టు కనిపిస్తూనే ఉంది. ఇప్పట్లో ఈ మహమ్మారి వదిలేలా అనిపించడం లేదు. సామాన్యుడి దగ్గర నుంచి బడా బాబుల వరకు ప్రతీ ఒక్కరి మీద ఊహించనంతగా ప్రభావం చూపించింది. ఈ నేపథ్యంలో సౌత్, నార్త్ .. తో పాటు హాలీవుడ్ సినీ పరిశ్రమలు కూడా ఊబిలో కూరుకుపోయాయి.  ముఖ్యంగా మన తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ ప్రొడ్యూసర్స్ మీద కరోనా ప్రభావం ఎక్కువగా పడింది. ఇంకా చెప్పాలంటే ఈ ప్రభావం ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు మీద ఎక్కువగా ఉందని తెలుస్తుంది.

 

నిర్మాతగా డిస్ట్రిబ్యూటర్ గా దిల్ రాజు కి గత కొంతకాలంగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఒక్క సినిమా బ్లాక్ బస్టర్ అయితే.. వరుసగా రెండు మూడు సినిమాలు భారీ డిజాస్టర్స్ గా మిగులుతున్నాయి. ఈ మధ్య కాలంలో నిర్మాతగా చిన్న సినిమాలు తీసిన కూడా దిల్ రాజు కి నిరాశే మిగిలింది. కోలీవుడ్ సినిమా 96 ని రీమేక్ చేస్తే కనీసం సమంత కోసం థియోటర్స్ కి వచ్చినవాళ్ళు కూడా లేక ప్రయోగం వికటించింది. ఇక తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మిస్తున్న బాలీవుడ్ హిట్ సినిమా రీమేక్ వకీల్ సాబ్ ని భారీగా నిర్మిస్తున్నారు.

 

ఈ సినిమాతో పాటు దర్శక ధీరుడు ఎస్.ఎస్ రాజమౌళి భారీ మల్టీ స్టారర్ ఆర్ఆర్ఆర్ నైజాం పంపిణీ హక్కులు భారీ మొత్తానికి దక్కించుకున్నారు. ఇద్దరు టాప్ స్టార్స్ తో పాన్ ఇండియా సినిమాగా రూపొందిస్తున్నారన్న క్రేజ్ తో దిల్ రాజు పోటీ పడి మరీ నైజాం పంపిణీ హక్కులు సొంతం చేసుకున్నారు. అయితే కరోనా చూపించిన తీవ్ర ప్రభావంతో ఇప్పుడు మొత్తం మార్కెట్ కుదేలైంది. పరిస్థితులన్ని తారుమారయ్యాయి. 

 

ఇక ఇప్పటికే రిలీజ్ చేయాల్సిన నాని వి సినిమా కూడా ల్యాబ్ లోనే ఉండిపోయింది. వకీల్ సాబ్ కి ఇంకా నెలరోజుల వర్క్ పెండింగ్ ఉంది. ఒకవేళ థియోటర్స్ ఓపెన్ అయినా జనాలు థియోటర్స్ వరకు వచ్చే నమ్మకాలు దరిదాపుల్లో కూడా కనిపించడం లేదు. దాంతో ప్రస్తుతం దిల్ రాజు పరిస్థితి కాస్త గందరగోళంగా ఉందని అంటున్నారు. ఒకవేళ ఓటీటీలో రిలీజ్ చేస్తే తర్వాత పరిస్థితులు ఎలా తలెత్తుతాయి ..లేదా థియోటర్స్ లో రిలీజ్ చేద్దామన్నా అయోమయంగా ఉంది ..దీంతో దిల్ రాజు కి ఇంకో దారి ఏదీ లేక అవస్థలు పడుతున్నాడని ఫిల్మ్ నగర్ లో చర్చించుకుంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: