అక్కినేని అఖిల్ మొదటి సినిమా అఖిల్ తో టాలీవుడ్ పరిచయమైనా భామ సయేశా సైగల్. తెలుగులో హిట్టు కొట్టకపోయినా ఓ ఐడెంటిటీ తెచ్చుకున్న ఈ అమ్మడు సెకండ్ సినిమా బాలీవుడ్ యాక్షన్ హీరో అజయ్ దేవగన్ తో కలిసి చేసింది. శివాయ్ సినిమాలో అజయ్ దేవగన్ తో నటించిన సయేశా ఆ సినిమాతో బాలీవుడ్ లో కూడా క్రేజ్ తెచ్చుకుంది. ఇక మూడవ సినిమాతో తమిళ చిత్ర పరిశ్రమకు పరిచయమైంది. కోలీవుడ్ లో వన్ మగన్ సినిమాతో ఎంట్రీ ఇవ్వగా ఆ సినిమా హిట్ అవడంతో అక్కడ వరుస అవకాశాలు వచ్చాయి. 

 

తమిళంలో రేడేళ్ళలో వరుసగా ఐదు సినిమాలు చేసిన ఈ అమ్మడు గజినీకాంత్ సినిమా టైం లో ఆ సినిమాలో హీరోగా నటించిన ఆర్యతో ప్రేమలో పడ్డది. ఇద్దరి అభిప్రాయలు కలవడం వీరి ప్రేమకు పెద్దల అంగీకారం లభించడంతో 2019లో వీరిద్దరూ ఒకటయ్యారు. పెళ్లి తర్వాత సినిమాలపై సయేశా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఇద్దరు హనీమూన్ పిక్స్ ను సోషల్ మీడియాలో షేర్ చేసిన ఈ  అమ్మడు ఇప్పుడు కాస్త బొద్దుగా కనిపించడం చూసి సయేశా ప్రెగ్నెన్సీతో ఉందని అంటున్నారు. 

 

మొన్నామధ్య కొద్దిగా బొద్దుగా మారినట్టు కనిపించిన సయేశా ఈమధ్య కాలంలో వచ్చిన వీడియోలో లూజ్ డ్రెస్ వేసుకుని చిన్నగా నడుస్తుండటం జరిగింది. అది చూసి కోలీవుడ్ మీడియా సయేశా సైగల్ ప్రెగ్నెన్సీతో ఉందని వార్తలు రాస్తున్నారు. అయితే ఈ వార్తల్లో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియాల్సి ఉంది. ఆర్య, సయేశా చూడముచ్చటైన ఈ జంట మళ్ళీ సినిమాల్లో జోడీ కట్టాలని అనుకుంటున్నారు ప్రేక్షకులు. టాలీవుడ్ లో నాగ చైతన్య, సమంతలా ఈ ఇద్దరు పెళ్లయిన తర్వాత కూడా సినిమాలు చేస్తారని తెలుస్తుంది.                 

మరింత సమాచారం తెలుసుకోండి: