టాలీవుడ్ లో సక్సస్ ఫుల్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్నాడు యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి. నందమూరి కళ్యాణ్ రాం నటించిన పటాస్ సినిమా తో దర్శకుడిగా మారాడు. ఆ తర్వాత సుప్రీం, రాజా ది గ్రేట్, ఎఫ్ 2, సరిలేరు నీకెవ్వరు లాంటి బ్లాక్ బస్టర్స్ ని తీశాడు. చెప్పాలంటే ఈ ట్రాక్ రికార్డ్ రాజమౌళి కొరటాల శివ తర్వాత అనిల్ రావిపూడి మాత్రమే సాధించాడు. వరసగా హిట్ ఇస్తుండటంతో టాలీవుడ్ లో యంగ్ హీరోల దగ్గర్నుంచి స్టార్ హీరోల వరకు అందరు అనిల్ రావిపూడి తో సినిమా చేయడానికి ఆసక్తిగా ఉన్నారు. 

 

ఇదంతా ఎఫ్2 తో వచ్చిన క్రేజే అని చెప్పాలి. ఈ సినిమా 100 కోట్ల క్లబ్ లో చేరడంతో సూపర్ స్టార్ అనిల్ రావిపూడి చెప్పిన కథ కి ఒకే చెప్పడం అది సెట్స్ మీదకి వెళ్ళడం రిలీజవడం చక చకా జరిగిపోయాయి. అయితే ఈ సినిమా గురించి ఇండస్ట్రీతో పాటు మహేష్ ఫ్యాన్స్ కామన్ ఆడియన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. అయితే ఈ సినిమా భారీ హిట్ ని నమోదు చేసుకుంది గాని అందరూ ఊహించినంతగా మాత్రం అంచనాలను అందుకోలేపోయింది. ఇక ఈ సినిమా తర్వాత అనిల్ రావిపూడి దిల్ రాజు తో ఉన్న ఒప్పందం ప్రకారం ఎఫ్3 చేయాలి. ఈ నేపథ్యంలోనే సరిలేరు తర్వాత పూర్తిగా ఎఫ్3 స్క్రిప్ట్ తయారు చేసే పనిలో బిజీగా ఉన్నాడు.

 

అయితే ఈ మద్యలో అనిల్ రావిపూడి నందమూరి బాలకృష్ణ తో ఒక సినిమా చేస్తాడన్న వార్తలు వచ్చాయి. రామారావు అన్న టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కనుందని అన్నారు. కాని అందుకు సంబంధించిన న్యూస్ ఏదీ అఫీషియల్ గా అనౌన్స్ కాలేదు. ప్రస్తుతం బాలయ్య బోయపాటి శ్రీను తో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత పూరి జగన్నాధ్ దర్శకత్వంలో నటించే అవకాశాలున్నాయని తెలుస్తుంది.

 

దాదాపు ఇదే ఫైనల్ అన్న టాక్ కూడా వినిపిస్తుంది. ఇక తాజాగా అనిల్ రావిపూడి వెంకటేష్ తో ఒక సినిమా చేయడానికి ఇద్దరి మధ్య చర్చలు జరుగుతున్నాయని ఫిల్మ్ నగర్ లో చర్చించుకుంటున్నారు. కాని ఇది ఎఫ్3 కాదట. వీటిలో ఏది నిజమో ముందు ఏ ప్రాజెక్ట్ పట్టాలెక్కుతుందో అనిల్ రావిపూడి  క్లారిటి ఇస్తేగాని నమ్మలేము. 

మరింత సమాచారం తెలుసుకోండి: