కరోనా ప్రభావంతో భారీ సినిమాల నిర్మాణ విషయంలో అనేక మార్పులు చేర్పులు వస్తాయని గతంలో లా భారీ సెట్స్ తో సినిమాలు తీసే పరిస్థితులు ఉండకపోవచ్చు అని  చాలామంది అభిప్రాయపడ్డారు. ఆమధ్య రాజమౌళి కూడ ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మారిన పరిస్థితులను అర్ధం చేసుకుని భారీ చిత్ర నిర్మాతలు దర్శకులు తమ ఖర్చులను అదుపులో పెట్టుకోవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి అంటూ కామెంట్స్ చేయడంతో కరోనా రాజమౌళిని కూడ మార్చేసింది అని అనుకున్నారు అంతా.


అయితే ఈవైరాగ్యం ఎక్కువ కాలం రాజమౌళి విషయంలో నిలబడలేదు. ఈనెలలోనే షూటింగ్ లు ప్రారంభమయ్యే అవకాశం ఉండటంతో ఇక ఒక్కరోజును కూడ వృథా చేయకూడదు అన్న ఉద్దేశ్యంతో రాజమౌళి తన టీమ్ అను అంతా ఈమధ్య సమావేశపరిచి ‘ఆర్ ఆర్ ఆర్’ కు సంబంధించిన యాక్షన్ ప్లాన్ ను డిజైన్ చేసినట్లు టాక్.


తెలుస్తున్న సమాచారం మేరకు ‘ఆర్ ఆర్ ఆర్’ తదుపరి షెడ్యూల్‌ ను గండిపేటలో ప్లాన్ చేస్తున్నారు అని తెలుస్తోంది. ఈషెడ్యూల్ కోసం అక్కడ 18 కోట్ల విలువైన భారీ గ్రామ సెట్ ని నిర్మించే పనిలో రాజమౌళి టీమ్ చాల బిజీగా ఉంది. గండిపేట హైదరాబాద్ శివార్లలో ఉండటం రాజమౌళి వేసిన సెట్ చాల పెద్దది కావడంతో యూనిట్ సబ్యులు కొద్దిగా ఎక్కువగా ఉన్నా ఇంత పెద్ద సెట్లో సామాజిక దూరాన్ని పాటించడం చాల తేలిక అన్నఅభిప్రాయం రాజమౌళికి ఉన్నట్లు టాక్.


అంతేకాదు సుమారు నెల రోజుల పాటు ఈసెట్లో రాత్రి పగళ్ళు షూట్ చేద్దామని అవసరం అనుకుంటే రోజుకు 18 గంటలు పనిచేయడానికి చరణ్ జూనియర్ లను సిద్ధపడమని ఇప్పటికే జక్కన్న స్పష్టమైన సంకేతాలు వారిద్దరికీ ఇచ్చాడు అనితెలుస్తోంది.  దీనితో కేవలం ఒక షెడ్యూల్ కోసం 18 కోట్ల సెట్ ను రాజమౌళి వేస్తున్నాడు అంటే ‘ఆర్ ఆర్ ఆర్’ విషయంలో రాజమౌళి యాక్షన్ ప్లాన్ లో ఎలాంటి మార్పులు లేవు సరికదా పొదుపు చర్యలు కూడ లేవు అన్న మాటలు ఇండస్ట్రీలో వినిపిస్తూ కరోనా వచ్చినా భారీ సినిమాల యాక్షన్ ప్లాన్ ఎట్టి పరిస్థితులలో మారదు అన్నవిషయానికి ఇది ఒక ఉదాహరణ మాత్రమే అన్న మాటలు వినిపిస్తున్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి: