ఒకేసారి రెండు సినిమాలు చేసే అలవాటు పవన్ కెరియర్ లో ఎప్పుడు లేదు. అయితే ఎన్నికలలో ఘోర పరాజయం తరువాత పవన్ వరసపెట్టి సినిమాలు ఒప్పుకుంటూ ఒకేసారి రెండు సినిమాలను లైన్ లో పెట్టి ఇచ్చిన షాక్ ను కరోనా వైరస్ కూడ తట్టుకోలేక పోయింది.


దీనితో పవన్ మొదలు పెట్టిన రెండు సినిమాలు ఎటూ కాని పరిస్థితులలో ఆగిపోయాయి. ‘వకీల్ సాబ్’ మూవీ షూటింగ్ అంతా ఒక కోర్టు సెట్ లో జరిగే పరిస్థుతులలో ఆ సినిమాకు ఎటువంటు సమస్యలు లేవు. అయితే సమస్య అంతా క్రిష్ దర్శకత్వంలో ప్రారంభం అయిన ‘విరూపాక్ష’ మూవీ చుట్టూనే సమస్యలు చుట్టు ముడుతున్నాయి.  


సినిమా లో పవన్ రెండు షేడ్స్ లో కనిపిస్తాడు అని తెలుస్తోంది. పవన్ నటించే పాత్రలలో ఒక పాత్ర మంచి వ్యక్తి పాత్ర అయితే మరొక పాత్ర దొంగ షేడ్ లో రాబిన్ హుడ్ పవన్ కనిపిస్తాడు. అయితే ఈ దొంగ పాత్రకు సంబంధించి ఎక్కువగా వివిధ రాష్ట్రాలలోని లోకేషన్స్ లో ఈ మూవీని తీయాలని క్రిష్ భావించాడు. అయితే ఇప్పుడు కరోనా వైరస్ సమస్యలు రావడంతో పవన్ తన సినిమాల షూటింగ్ అంతా హైదరాబాద్ లోనే తీయమని తన దర్శకులకు ఇప్పటికే స్పష్టమైన సూచనలు ఇచ్చినట్లు టాక్.


అయితే క్రిష్ ఎంచుకున్న కథ రీత్యా సినిమా అంతా హైదరాబాద్ చుట్టుపక్కల తీయడం కష్టం అనీ అందువల్ల ఈ మూవీ షూటింగ్ ను ముందుకు నడిపించాలి అంటే భారీ కోటలను పోలిన సెట్స్ వేయడం కానీ లేదంటే ఎక్కువగా గ్రాఫిక్స్ వర్క్స్ తో సినిమాను పూర్తి చేయడం కానీ అనే రెండు మార్గాలు క్రిష్ దృష్టిలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ రెండు మార్గాలు చాల ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి రాజస్థాన్ ప్రాంతంలోని భారీ కోటలు అక్కడి ఎడారి ప్రాంతాలలో ఈ మూవీ షూటింగ్ ను సహజ సిద్ధంగా షూట్ చేద్దాము అంటే పవన్ ఇప్పుడు కరోనా వైరస్ పరిస్థితుల రీత్యా ఒప్పుకోవడం లేదు అని టాక్. దీనితో క్రిష్ ఈసినిమాకు సంబంధించి వేసుకున్న యాక్షన్ ప్లాన్ టెక్నికల్ వర్క్ ప్రొడక్షన్ కాస్ట్ అన్నీ మారిపోయి కన్ఫ్యూజ్ అవుతూ ఉండటంతో పవన్ ఈ సమస్యను గ్రహించి ముందుగా హరీష్ శంకర్ సినిమా పూర్తి చేసి ఆ తరువాత క్రిష్ సినిమా చేస్తాను అని చెపుతున్న మాటలకు ఎలా పవన్ ను ఒప్పించాలో తెలియక క్రిష్ మధన పడుతున్నట్లు గాసిప్పులు సందడి చేస్తున్నాయి..  

 

మరింత సమాచారం తెలుసుకోండి: