ప్రస్తుతం టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో పెద్దన్న పాత్ర పోషిస్తున్న చిరంజీవి ఇక రానున్న రోజులలో ఈ పాత్రను పోషించడానికి పెద్దగా ఆసక్తి కనపరచడం లేదు అన్న లీకులు వస్తున్నాయి. వాస్తవానికి కరోనా సమస్య మొదలైన తరువాత ఇండస్ట్రీలోని అతి తక్కువ ఆదాయం కలవారిని ఆదుకోవడానికి కరోనా క్రైసెస్ ఫండ్ ఏర్పాటు చేయడం ఆతరువాత లాక్ డౌన్ కు ప్రభుత్వాలు అనేక మినహాయింపులు ఇస్తున్న పరిస్థితులలో తిరిగి షూటింగ్ లు మొదలు కావడానికి చిరంజీవి చిత్త సుద్ధితో ప్రభుత్వ పెద్దలతో అనేక రాయబారాలు చేసి తన పెద్దరికాన్ని కొనసాగించాడు. 


అయితే చిరంజీవి తీరును ఇన్ డైరెక్ట్ గా టార్గెట్ చేస్తూ బాలకృష్ణ తన అసహనాన్ని ఓపెన్ గా కామెంట్ చేయడమే కాకుండా తనను కూడ ఇండస్ట్రీ సమావేశాలకు పిలవనందుకు నిరశన తెలియచేసిన తరువాత చిరంజీవి జరుగుతున్న పరిణామాల పై అసంతృప్తితో ఉన్నట్లు టాక్. వాస్తవానికి బాలకృష్ణను తన ఇంటిలో జరిగే సమావేశాలకు పిలవాలని చిరంజీవి భావించినా కొందరు పిలవద్దని చిరంజీవికి సలహా ఇచ్చి ఇప్పుడు వివాదాలు మొదలయ్యాక ఆ విషయాల నుండి తప్పించుకోవడం చిరంజీవికి బాధను కలిగించినట్లు తెలుస్తోంది. 


దీనితో ప్రస్తుతం చిరంజీవి షూటింగ్ ల పునఃప్రారంభం విషయమై జరుగుతున్న రాయబారాలకు దూరంగా ఉండటమే కాకుండా తన ‘ఆచార్య’ మూవీ షూటింగ్ ను కూడ సెప్టెంబర్ నుండి మొదలుపెట్టాలని భావిస్తున్నట్లు టాక్. దీనితో చిరంజీవి ఒకేసారి ఇలా యూటర్న్ తీసుకోవడం వెనుక ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అంటూ మరికొందరు సందేహాలు వ్యక్త పరుస్తున్నారు. 


ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో కరోనా తీవ్ర స్థాయికి చేరుకోవడంతో ఇప్పట్లో షూటింగ్ లు మొదలైనా షూటింగ్ లకు వచ్చే ఆలోచన చిరంజీవితో పాటు అల్లు అర్జున్ మహేష్ లకు లేదు అన్నప్రచారం జరుగుతోంది. దీనితో ఇదే పద్ధతిని పవన్ కళ్యాణ్ జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ లు అనుసరిస్తారా లేదంటే వారి సినిమాలు కరోనా ను లెక్కచేయకుండా జాగ్రత్తలు తీసుకుంటూ మొదలు అవుతాయా అన్న విషయమై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి..      

 

మరింత సమాచారం తెలుసుకోండి: