స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్ల కు సోలో సాంగ్స్ చాలా అరుదుగా దొరుకుతుంటాయి. అది కూడా ప్రభాస్ లాంటి మాస్ యాక్షన్‌ హీరో సినిమాలో హీరోయిన్‌కి సోలో సాంగ్ అంటే ఇంకా చెప్పాలా..? అలాంటి లక్కీ చాన్స్ కొట్టేసిన బ్యూటీ చెన్నై చంద్రం త్రిష. ప్రభాస్‌ హీరోగా తెరకెక్కిన బ్లాక్‌ బస్టర్ హిట్‌ మూవీ వర్షం. ఈ సినిమాలో హీరోయిన్‌ ఇంట్రడక్షన్‌ సీన్ ‌ను అద్భుతంగా ప్లాన్‌ చేశాడు దర్శకుడు శోభన్‌. ఎప్పుడు 80స్ ‌లో వాన పాటలు ఫేమస్‌ అనిపించుకున్నాయి.

 

కానీ ఈ జనరేషన్‌ లో సూపర్‌ హిట్ అయిన వాన పాట వర్షం సినిమాలోది. ఒక్క పాట లోనే హీరో హీరోయిన్ల మధ్య ప్రేమ పుట్టడంతో పాటు విలన్‌ ఇంట్రడక్షన్‌ కూడా అదే పాటలో ప్లాన్ చేశాడు దర్శకుడు. ఇన్నాళ్లకు గుర్తొచ్చాన అంటూ వాన మీద హీరోయిన్ అలక చూపించటం అనే కాన్సెప్ట్‌ తో ఈ పాటను రూపొదించాడు దర్శకుడు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతమందించిన ఈ పాటకు సిరివెన్నెల సీతారామ శాస్త్రీ స్వరాలందించగా.. చిత్ర, రకీబ్‌ అలం, కల్పనలు ఆలపించారు.

 

ఈ పాటకు మరింత హైప్ తీసుకు వచ్చిన అంశం ప్రభుదేవా కొరియోగ్రఫి. ఇలా అన్ని కలిసి ఈ పాట సూపర్ హిట్ అయ్యింది. ఇప్పటికీ ఈ పాట ప్రజల గుండెల్లో మారుమొగుతూనే ఉంది. ఈ పాటలో త్రిష గ్లామర్‌, ఎక్స్‌ ప్రెషన్స్ సూపర్బ్ అనిపిస్తాయి. అందుకే అభిమానుల గుండెల్లో ఈ పాట అలాగే నిలిచిపోయింది. ఇక సినిమా విషయానికి వస్తే అవుట్ అండ్‌ అవుట్ లవ్‌ స్టోరి కి రివేంజ్ డ్రామాను జోడించి అద్భుతంగా తెరకెక్కించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: