ఎన్టీఆర్ కెరీర్ లో ది బెస్ట్ సినిమాల్లో ప్రత్యేకంగా చెప్పుకునే సినిమా వేటగాడు. ఈ సినిమా సృష్టించిన సంచలనం గురించి ఎంత చెప్పినా సరే తక్కువే అవుతుంది. టాలీవుడ్ లో నే కాదు ఇండియన్ సినిమాకు కూడా ఈ సినిమా ఎప్పటికి కూడా హైలెట్ అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఈ సినిమాలో ప్రతీ పాట కూడా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ప్రత్యేకంగా చెప్పుకునే పాట ఒకటి ఉంది. ఆ పాటతో ఒక్కసారిగా శ్రీదేవి రేంజ్ అమాంతంగా పెరిగిపోయింది అని చెప్పవచ్చు. 

 

ఆకుచాటు పింద తడిచే అనే పాట ఒక సంచలనం సృష్టించింది. ప్రధానంగా ఈ పాటలో శ్రీదేవి అందాలు ఇండియన్ సినిమాను షేక్ చేసాయి. ఆ పాటలో ఆమె డాన్స్ గాని ఆమె హావ భావాలు గాని అన్నీ కూడా ఒక సంచలనం అనే చెప్పుకోవచ్చు. ఇప్పటికి ఆ పాట వచ్చినా సరే ప్రేక్షకులు మిస్ అయ్యే పరిస్థితి ఉండదు అనే చెప్పవచ్చు. ఈ పాట తర్వాత శ్రీదేవి తో మంచి పాటలు చెయ్యాలి అనే ఆలోచన చాలా మంది నిర్మాతలకు దర్శకులకు వచ్చింది అని చెప్పవచ్చు. ఇక ప్రత్యేకంగా ఈ పాట సంగీతం కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. 

 

సినిమా ఏ స్థాయిలో హిట్ అయిందో ఆ పాట కూడా అదే స్థాయిలో హిట్ అయింది అని చెప్పవచ్చు. ఈ పాట తర్వాత ఆమె ఇక వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు అనే చెప్పవచ్చు. పాటను ఎంత అందంగా తీసారు అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇప్పటికి కూడా ఈ పాట ను యుట్యూబ్ లో కచ్చితంగా చూసే ఎన్టీఆర్ అభిమానులు కూడా ఉన్న సంగతి తెలిసిందే. ఆ విధంగా పాట హిట్ అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: