తెలుగు చిత్ర పరిశ్రమలో కాజల్ అగర్వాల్ కి ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. లక్ష్మీ కళ్యాణం సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోయిన్గా పరిచయమైంది కాజల్ అగర్వాల్. మొదటి సినిమానే మంచి విజయం సాధించింది. మొదటి సినిమాలో నందమూరి హీరో కళ్యాణ్ రామ్ తో జోడి కట్టిన నటించింది కాజల్ అగర్వాల్. ఇక ఆ తర్వాత చందమామ సినిమాలో నటించిన కాజల్ అగర్వాల్... మరింత క్రేజ్ సంపాదించింది. ఇలా అంచెలంచెలుగా ఎదుగుతూ స్టార్ హీరోయిన్గా మారిపోయింది. తెలుగు ప్రేక్షకులందరికీ చందమామ లాంటి హీరోయిన్ గా మారిపోయింది కాజల్ అగర్వాల్. ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో చందమామ లాంటి హీరోయిన్ ఎవరూ అంటే అందరూ టక్కున చెప్పే పేరు కాజల్ అగర్వాల్. 

 


 ఎప్పుడూ తన అందం అభినయంతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటూనే ఉంది ఈ అమ్మడు. వరుసగా స్టార్ హీరోల సినిమాలో ఛాన్స్ కొట్టేసిన కాజల్ అగర్వాల్ ఎంతగానో ఇమేజ్ సంపాదించుకుంది. దాదాపు దశాబ్ద కాలానికి పైగా తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా కొనసాగింది. ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. అయితే కాజల్ అగర్వాల్ ఎన్ని సినిమాల్లో నటించినప్పటికీ కాజల్ అగర్వాల్ పేరు చెప్పగానే గుర్తొచ్చే పాట మాత్రం... పంచదార బొమ్మ బొమ్మ. మెగాపవర్ స్టార్  రామ్ చరణ్ హీరోగా దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం మగధీర. ఈ సినిమాలో  కాజల్ అగర్వాల్ రామ్ చరణ్ కు  జోడీగా నటించిన విషయం తెలిసిందే. 

 


 ఈ సినిమాలో తన అందం అభినయంతో పాటు తన నటనతో ఆకట్టుకుంది కాజల్ అగర్వాల్. అయితే ఈ సినిమాలు పంచదార బొమ్మ బొమ్మ అనే పాట కాజల్ కెరీర్ లోనే ఒక స్పెషల్ సాంగ్ గా మిగిలిపోయింది. ఈ పాటలో కాజల్ అగర్వాల్ అందం అభినయానికి తెలుగు ప్రేక్షకులను మంత్రముగ్ధులు  అయిపోతుంటారు. నిజంగా కాజల్ అగర్వాల్ కోసమే ఈ పాట రాసారేమో అనేంతలా  పాటలో  కాజల్ అగర్వాల్ తన అభినయంతో ఆకట్టుకుంది. ఇలా కాజల్ ఎంతోమంది స్టార్ హీరోలతో సినిమాలు చేసి ఎన్నో పాటల్లో  చేసినప్పటికీ... కాజల్ అగర్వాల్ కెరీర్ లో  తెలుగు ప్రేక్షకులకు గుర్తుండిపోయే పాట మాత్రం ఈ పాటే  అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: