ఒకప్పుడు సీనియర్ హీరోల సరసన నటించి ఎంత గానో  గుర్తింపు సంపాదించిన స్టార్ హీరోయిన్లు... నేటి తరం యువ హీరోలతో కూడా స్టెప్పులు వేసి మంచి క్రేజ్ సంపాదిస్తూ  ఉంటారు. నేటి తరం హీరోలకు తాము కూడా ఎక్కడ తక్కువ కాదు అని నిరూపిస్తూ ఉంటారు. ఇలా నేటి యువ హీరోయిన్లకు కూడా గట్టి పోటీ ఇచ్చే హీరోయిన్లలో ఒకరు రంభ. రంభ కొన్ని సంవత్సరాల పాటు తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా కొనసాగిన విషయం తెలిసిందే. స్టార్ హీరోయిన్ గా ఎంతోమంది స్టార్ హీరోల సినిమాల్లో నటించి ఎన్నో విజయాలను కూడా తన ఖాతాలో వేసుకుంది. ఏ హీరోయిన్ కైనా కొంతకాలం తర్వాత అవకాశాలు తగ్గుతాయి అన్న విషయం తెలిసిందే. హీరోయిన్ రంభ విషయంలో కూడా అలాంటిదే జరిగింది. 

 


 కొన్ని రోజుల తర్వాత రంభకి అవకాశాలు తగ్గాయి. జూనియర్ హీరోలు రావడం కొత్త కొత్త హీరోయిన్లు  వచ్చి స్టార్ డం  సంపాదించడంతో... చిత్ర పరిశ్రమలో మంచి హవా  నడిపించిన రంభ కి అవకాశాలు తగ్గిపోయాయి. దీంతో కొన్ని రోజుల పాటు ఎక్కడ తెరమీద కనిపించలేదు రంభ. అక్కడక్కడా కొంతమంది హీరోల సినిమాల్లో నటించినప్పటికీ అంతగా గుర్తింపు మాత్రం సంపాదించలేకపోయింది. కానీ జూనియర్ ఎన్టీఆర్ సినిమా ద్వారా మళ్లీ మరోసారి పాత క్రేజ్ సంపాదించింది. ఏకంగా కొన్ని రోజుల పాటు టాలీవుడ్ లో ట్రెండ్ గా మారిపోయింది. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ప్రియమణి హీరోయిన్ గా దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన యమదొంగ.ఈ  సినిమా ఎంత ఘనవిజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 

 


 జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ ని కీలక మలుపు తిప్పింది ఆ సినిమా. ఈ సినిమా జూనియర్ ఎన్టీఆర్ కు మరింత క్రేజ్ తెచ్చిపెట్టింది. ఈ సినిమాలో సరికొత్త లుక్తో కనిపించిన జూనియర్ ఎన్టీఆర్ కామెడీ టైమింగ్ తో ఆకట్టుకున్నాడు. ఇక ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్తో స్టెప్పులేసింది రంభ. నాచోరే నాచోరే అంటూ సాగిపోయే పాటలు జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి స్టెప్పులు వేసి అందరిని ఆకర్షించింది రంభ. దీంతో ఇండస్ట్రీలో రంభ పేరు మరోసారి హాట్ టాపిక్ గా మారిపోయింది. కొన్ని రోజుల పాటు నాచోరే నాచోరే పాట తెలుగు చిత్ర పరిశ్రమలో ట్రెండింగ్ గా మారిపోయింది. దీంతో మరోసారి ఎంతగానో క్రేజ్ సంపాదించింది నాటి  హీరోయిన్ రంభ.

మరింత సమాచారం తెలుసుకోండి: