తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోయిన్లు ఒక్క పాటతో ఎంతో క్రేజ్ సంపాదిస్తారు. అప్పటికే స్టార్ హీరోయిన్ లుగా కొనసాగినప్పటికీ ఆ ఒక్క పాట మాత్రం ఆ హీరోయిన్ పేరు చెప్పగానే ప్రేక్షకుల మదిలో మెదులుతూ ఉంటుంది. ఒక్క పాటతో ఎంతగానో ప్రభావితం చేసి సినీ ప్రేక్షకులకు మరింత దగ్గర అవుతూ ఉంటారు హీరోయిన్లు. ఒక్క పాటతోనే స్టార్ హీరోయిన్ రేంజ్ కూడా సంపాదిస్తూ ఉంటారు. ఇలా స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్నప్పటికీ ఒక పాట తో తెలుగు ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకుంది సమంత. ఆ పాటే రంగస్థలం సినిమా నుంచి రంగమ్మ మంగమ్మ అనే పాట. పెళ్లి తర్వాత సమంత హీరోయిన్ గా నటించిన రంగస్థలం సినిమా ఎంత హిట్ సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. 

 


 ఈ సినిమాలో పల్లెటూరి అమ్మాయి గా నటించిన సమంత పాత్రలో ఒదిగిపోయి నటించిన తీరు ఎంతో మందిని ఆకర్షించింది. అయితే అప్పటి వరకు సమంత టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గానే  కొనసాగుతోంది. స్టార్ హీరోల సినిమాల్లో నటించి ఎంతగానో ఆకర్షించింది. మంచి క్రేజ్ కూడా సంపాదించింది. కానీ రంగస్థలం సినిమాలో రంగమ్మ మంగమ్మ అంటూ సాగిపోయే పాట ద్వారా తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో దగ్గరయింది సమంత. ఈ ఒక్క పాట తెలుగు చిత్ర పరిశ్రమలో సమంత క్రేజ్ ని మరింతగా పెంచేసింది. 

 


 దీంతో అప్పటి వరకు స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నప్పటికీ... ఈ పాట మాత్రం అక్కినేని వారి కోడలు సమంతని తెలుగు ప్రేక్షకుల మదికి  చాలా దగ్గర చేసింది. ఇప్పటివరకు చాలా పాటల్లోని నటించినప్పటికీ... రంగమ్మ మంగమ్మ అనే పాటలో  పల్లెటూరి అమ్మాయి పాత్రలో... సమంత అభినయం నటన తో కూడిన డ్యాన్సులు చేస్తూ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. పెళ్లి తర్వాత ఈ సినిమా సమంత కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఇలా సమంత స్టార్ హీరోయిన్ గా ఉన్నప్పటికీ రంగస్థలం సినిమాలోని రంగమ్మ మంగమ్మ అనే పాట మాత్రం సమంతకి సరికొత్త క్రేజ్ తెచ్చిపెట్టింది అనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: