తెలుగు చిత్ర పరిశ్రమలో చాలా మంది హీరోయిన్లు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే హీరోయిన్ గా వచ్చి మంచి క్రేజ్ సంపాదించాలని అంటే... ఏదో ఒక స్పెషల్ మూమెంట్ రావాలి అని అంటుంటారు. అయితే కొంతమందికి  సినిమాల ద్వారా వస్తే ఇంకొంతమందికి కొన్ని పాటల ద్వారా ఎంతో క్రేజ్ వస్తూ ఉంటుంది. ఇలా ఒక్క పాటతోనే ఎంతగానో క్రేజ్ సంపాదించిన హీరోయిన్లు చాలామంది ఉన్నారు. ఒక్క పాటతో తెలుగు చిత్ర పరిశ్రమలో కొంతమంది  హీరోయిన్ల పేరు మారుమోగిపోయింది. ఇలా ఒక్క పాట తో మంచి క్రేజ్ సంపాదించి తెలుగు ప్రేక్షకులందరికీ దగ్గరైన హీరోయిన్లలో కీర్తి సురేష్ కూడా ఒకరు ఉన్నారు. కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో... తెలుగు చిత్ర పరిశ్రమ గర్వించదగ్గ మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం మహానటి అనే విషయం తెలిసిందే. 

 


 ఈ సినిమా కీర్తి సురేష్ కెరీర్లోనే ఒక మైలురాయిగా నిలిచిపోయింది. ఈ ఒక్క సినిమాతో కీర్తి సురేష్ క్రేజ్ కూడా ఒక్కసారిగా పెరిగిపోయింది. సాదాసీదా హీరోయిన్ కీర్తి సురేష్ ని స్టార్ హీరోయిన్ లెవెల్ కి తీసుకెళ్ళింది ఈ సినిమా. సినిమాలో  కీర్తి సురేష్ సావిత్రి పాత్రలో ఒదిగిపోయి నటించిన తీరు ఎంతగానో విమర్శకుల ప్రశంసలను సైతం అందుకుంటుంది. ముఖ్యంగా ప్రస్తుతం నేటి తరానికి మొత్తం సావిత్రి అంటే కీర్తి సురేష్ అనేంతలా పాత్రలో ప్రభావితం చేసింది యువ హీరోయిన్. అయితే కీర్తి సురేష్ మహానటి సినిమాలో  నటించినప్పటికీ ఒక్క పాట మాత్రం కీర్తి సురేష్ కెరియర్ లోనే ది బెస్ట్ సాంగ్ గా మారిపోయింది. 

 


 అదే మహానటి సినిమా లోని టైటిల్ సాంగ్. ఈ పాటలో  మహానటి సావిత్రి చిత్ర పరిశ్రమలో ఏ విధంగా ఎదిగింది... ఏదైనా సమస్య ఉంది అంటూ ఎవరైనా తన దగ్గరికి వస్తే ఎలా సహాయం చేసింది. సాదా సీదా యువతి మహానటిగా ఎలా మారింది. సావిత్రి జీవితంలో ఎలాంటి మలుపులు ఉన్నాయి అనే విషయాన్ని చూపిస్తూ ఉంటారు. ఈ పాటలో మహానటి పాత్రలో నటించిన కీర్తి సురేష్ ఒదిగి  పోయి చేసిన తీరు ఎంతో మందిని ఆకర్షించింది. ఈ ఒక్క పాట తో కీర్తి సురేష్ క్రేజ్  ఎంతగానో పెరిగిపోయింది. ఇప్పటికి కూడా ఈ పాట సినీ ప్రేక్షకులందరికీ ఫేవరెట్ గా ఉంటుంది. ఎన్నిసార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: