ఇప్పుడు అంటే సినిమాల్లో పెద్దగా పాటలను పట్టించుకోవడం లేదు గాని గతంలో పాటలకు ఉండే క్రేజ్ గురించి ఎంతః చెప్పినా సరే తక్కువే అవుతుంది. ప్రతీ సినిమాలో కూడా పాటలకు చాలా ప్రాధాన్యత ఇచ్చే వారు దర్శక నిర్మాతలు. ఎంతో అందంగా చూపించే వారు పాటలను. పాటల కోసం సినిమాలు చూసిన సందర్భాలు కూడా మన తెలుగులో అయినా ఏ భాషలో అయినా సరే ఉన్నాయి అని చెప్పవచ్చు. మన తెలుగు విషయానికి వచ్చి ఒకసారి చూస్తే...  కొన్ని కొన్ని పాటల కోసమే హాల్ కి వెళ్ళిన అభిమానులు కూడా ఉన్నారు. 

 

మన తెలుగులో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పాటలు కొన్ని ఉన్నాయి. టాలీవుడ్ ని షేక్ చేసిన పాటలు అందులో ఉన్నాయి. శ్రీదేవి చేసిన కొన్ని కొన్ని పాటలకు అయితే టాలీవుడ్ లో మంచి గుర్తింపు వచ్చింది. చిరంజీవి హీరోగా వచ్చిన అతిలోక సుందరి జగదేక వీరుడు సినిమాలో ఉండే కొన్ని కొన్ని పాటలకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు అని చెప్పవచ్చు. ఆ సినిమాలో దాదాపు పాటలు అన్నీ కూడా హిట్ అయ్యాయి. ఇక ఆ సినిమాలో ఉండే కొన్ని కొన్ని సన్నివేశాలు అందులో శ్రీదేవి అందాలు అదే విధంగా పాటల్లో శ్రీదేవి అందాలు ఎంతో ఆకట్టుకున్నాయి. 

 

సినిమా తర్వాత ఆమె కెరీర్ లో ఎవరికి అందని రేంజ్ లో ఉన్నా సరే  పాటలు మాత్రం చాలా బాగా హిట్ అయ్యాయి అని చెప్పవచ్చు. ఇక ఆ పాటల తర్వాత ఆమెతో దర్శకులు చాలా మంచి పాటలు తీసుకొచ్చే ప్రయత్నాలు చేసిన సందర్భాలు ఉన్నాయి అని చెప్పవచ్చు. ఇక ఆ సినిమా చిరంజీవి కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఆ సినిమా ఎన్నో రికార్డులను చిరంజీవి కి దర్శకుడు రాఘవేంద్ర రావు కి అందించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: