వైవీఎస్ చౌదరి దర్శకత్వంలో హరికృష్ణ హీరో గా వచ్చిన చిత్రం సీతయ్య. హరికృష్ణ కెరీర్ లో వచ్చిన ది బెస్ట్ సినిమా ఇదే. ఆయన హీరోగా ఎక్కువ సినిమాలు చేయలేదు గాని ఈ సినిమా మాత్రం ఆయనకు నటుడిగానే కాకుండా వేరే విధంగా కూడా మంచి గుర్తింపు తీసుకొచ్చింది అని చెప్పవచ్చు. ఈ సినిమాలో ఉండే కొన్ని కొన్ని సన్నివేశాలు ప్రేక్షకులను చాలా బాగా ఆకట్టుకున్నాయి అని చెప్పవచ్చు. ప్రతీ సన్నివేశం కూడా ప్రేక్షకులకు అలా గుర్తుంది అనేది వాస్తవం. హీరోగా హరికృష్ణ పలికించిన కొన్ని కొన్ని హావ భావాలకు ప్రేక్షకులకు ఫిదా అయిపోయారు అని చెప్పవచ్చు. 

 

ఆయనకు అన్ని విధాలుగా తగిన సినిమా ఇదే అని చాలా మంది అన్నారు కూడా. ఇక అది పక్కన పెడితే ఈ సినిమాలో సిమ్రాన్ చేసిన కొన్ని కొన్ని పాటలకు మంచి ఆదరణ వచ్చింది అని చెప్పవచ్చు. ఈ సినిమాలో సిగ్గు సిగ్గు అనే పాటకు గాను టాలీవుడ్ షేక్ అయింది. ఆ పాటలో సిమ్రాన్ నటన డాన్స్ అన్నీ కూడా ప్రేక్షకులను ఇంకా అలరిస్తూనే ఉంటాయి. సినిమా ఏ స్థాయిలో హిట్ అయిందో పాట కూడా అదే స్థాయిలో హిట్ అయింది అని చెప్పవచ్చు. ప్రతీ సీన్ కూడా ఆ పాటలో దర్శకుడు చాలా అందంగా చూపించాడు అనే చెప్పాలి. 

 

ఇక ఆ సినిమా తర్వాత సిమ్రాన్ కి పెద్దగా అవకాశాలు రాలేదు గాని ఆమె మాత్రం ప్రభావం చూపించింది టాలీవుడ్ లో. ఇక  పాట లిరిక్స్ కూడా చాలా అందంగా ఉండగా పాడిన వ్యక్తులు కూడా పాటను చాలా అందంగా పాడారు. లేడీ సింగర్ అయితే పాటకు మరింత మెరుగులు దిద్దుతూ పాడారు అనే చెప్పాలి. ఆ పాట సినిమాకే హైలెట్ గా నిలవడానికి సంగీతం కూడా ఒకటి.

మరింత సమాచారం తెలుసుకోండి: