మన తెలుగులో సాయి పల్లవికి మంచి గుర్తింపు తీసుకొచ్చిన సినిమా ఫిదా... ఈ సినిమాలో ఆమె నటనకు చాలా మంచి మార్కులు పడ్డాయి. సినిమాలో ఆమె లేకపోతే అసలు ఆ సినిమా ఆడే అవకాశం లేదని చాలా మంది అన్నారు కూడా. ఆమె మినహా ఎవరు నటించినా సరే ఆ స్థాయిలో సినిమాకు అందం వచ్చేది కాదు అని ప్రేక్షకులు సినిమా చూసి వచ్చిన తర్వాత కామెంట్స్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి అని చెప్పవచ్చు. ఇక ఆ సినిమాలో ఆమె నటన చూసిన ఇతర హీరోయిన్ లు కూడా కుల్లుకున్నారు అని అంటారు. 

 

ఆ విధంగా ఆమె ఆ సినిమాలో నటించింది. ఇక ఆ సినిమాలో వచ్చిందే అనే పాట లో ఆమె చేసిన డాన్స్ కి అయితే ఫిదా అయిపోయారు. ఆ విధంగా ఆ పాట హిట్ అయింది. ఆ పాటలో ఆమె వేసిన డాన్స్ చూసి చాలా మంది అలా చూస్తూ ఉన్నారు. ఇప్పటికి కూడా ఆ పాట సోషల్ మీడియాలో ఒక సంచలనం. ఆ విధంగా హిట్ అయింది ఆ పాట. ఇక ఆ పాట తర్వాత ఆమెతో కేవలం నటన మాత్రమే కాదు డాన్స్ కూడా చేయించవచ్చు అని చాలా మంది భావించి ఆమెకు మంచి మంచి డాన్స్ ఉన్న పాటలను ఇచ్చారు అని చెప్పవచ్చు. 

 

ఇక అది పక్కన పెడితే ఆమె నటనలో ఆ సినిమాలో మంచి పరిణితి ప్రదర్శించింది అని చెప్పవచు. అక్కడి నుంచి ఆమెకు వరుసగా అవకాశాలు వచ్చినా సరే ఆమె మాత్రం చాలా జాగ్రత్తగా సినిమాలను చేసుకుంటూ వస్తుంది. ప్రస్తుతం ఆమె చేతిలో తెలుగులో రెండు సినిమాలో ఉండగా తమిళంలో మూడు సినిమాలు ఉన్నాయి. ఇవి అన్నీ లాక్ డౌన్ కారణంగా ఆగిపోయాయి అని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: