ప్రభాస్ కెరీర్ లో నటుడిగా మంచి పేరు తీసుకొచ్చిన సినిమా రాఘవేంద్ర... ఈ సినిమాలో ప్రభాస్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. కెరీర్ మొదట్లో చేసిన సినిమా అయినా సరే ప్రభాస్ ఏ మాత్రం కూడా తడబడకుండా సినిమాలు చేసాడు. ఇక ఆ సినిమాలో ప్రభాస్  నటన తో పాటుగా హీరోయిన్ అన్షు నటన కు మంచి మార్కులు పడ్డాయి అని చెప్పవచ్చు. ఆ సినిమా తర్వాత అతని కెరీర్ లో మంచి సినిమాలు వచ్చాయి. ఇక అది పక్కన పెడితే ఆ సినిమాలో పాటల విషయానికి వచ్చి చూస్తే రెండు మూడు పాటలు బాగా హిట్ అయ్యాయి. 

 

ఆ సినిమాలో నీ స్టైల్ అనే పాట బాగా హిట్ అయింది. ఆ పాటలో హీరోయిన్ అన్షు అందాలు, అలాగే ఆమె చూపించిన హావ భావాలు ఫారెన్ లో షూట్ చేసిన కొన్ని కొన్ని సన్నివేశాలు ఆ పాటకు హైలెట్ గా నిలిచాయి. ఆ పాటకు గానూ హీరోయిన్ కి మంచి గుర్తింపు వచ్చింది అని చెప్పవచ్చు. కాగా ప్రభాస్ ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకి రానుంది. ఈ సినిమా తర్వాత అతను ఏ సినిమా చేస్తాడు అనేది  కూడా ఖరారు అయింది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. 

 

సినిమా తర్వాత అతను కొంచెం గ్యాప్ తీసుకుని ప్రశాంత్ నీల్ తో ఒక సినిమా చేసే అవకాశం ఉందని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. మరి చేస్తాడా లేదా అనేది ఇంకా ఖరారు కాలేదు. ప్రస్తుతం లాక్ డౌన్ లో ఖాళీ గా ఉంటున్న ప్రభాస్ సినిమాలను నిర్మించే విషయంలో బిజీ గా ఉన్నాడు అని వార్తలు వస్తున్నాయి మరి. ఏ సినిమాలను నిర్మిస్తాడు అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: