యంగ్ హీరో
నిఖిల్ ,చందూ మొండేటి కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం కార్తికే
య. పెద్దగా అంచనాలు లేకుండా వచ్చిన ఈచిత్రం సూపర్ హిట్ అయ్యింది అంతేకాదు ప్లాపుల్లో వున్న
నిఖిల్ కు సరైన సమయంలో
సక్సెస్ ఇచ్చి ఆదుకుంది. ఇప్పుడు ఈకాంబినేషన్ లో
కార్తికేయ 2 తెరకెక్కనుంది. ఇటీవలే ఈచిత్రం లాంచ్ కూడా అయ్యింది. అయితే ఈసినిమా, కార్తికేయకు సీక్వెల్ కాదు. ఇక ఈచిత్రంకోసం అనుపమ పరమేశ్వరన్ ను
హీరోయిన్ గా తీసుకున్నారు అయితే సినిమాలో తన పాత్ర వీక్ గా ఉండడంతో ఈప్రాజెక్టు నుండి ఆమె తప్పుకుందట దాంతో మేకర్స్ అనుపమ స్థానంలో మరో
హీరోయిన్ ను వెతుకుతున్నారు.
ఈసినిమా పాన్
ఇండియా మూవీ గా రానుండడం విశేషం. ఈ చిత్రంలో
నిఖిల్ సిక్స్ ప్యాక్ తో
డాక్టర్ గా కనిపించనున్నాడు. కుంభమేళా బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని పీపుల్
మీడియా ఫ్యాక్టరీ,అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ల పై టిజి విశ్వప్రసాద్ ,
వివేక్ కూచిబొట్ల ,
అభిషేక్ అగర్వాల్ నిర్మించనున్నారు. ఇక వరస పరాజయాల తరువాత
నిఖిల్, ఇటీవల
అర్జున్ సురవరం తో హిట్ కొట్టి ఫామ్ లోకి వచ్చాడు. ప్రస్తుతం నిఖిల్ ,కార్తికేయ2 తోపాటు 18పేజెస్ లో నటించనున్నాడు. కుమారి 21ఎఫ్ ఫేమ్ పల్నాటి
సూర్య ప్రతాప్ డైరెక్ట్ చేయనున్న ఈచిత్రాన్ని
గీతా ఆర్ట్స్ 2,
సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లు నిర్మించనున్నాయి.
ఇదిలావుంటే అవకాశాలు లేక సతమవుతున్న అనుపమ గత ఏడాది రాక్షసుడుతో హిట్ కొట్టింది అయినా కూడా ఈ సినిమా ఆమె కెరీర్ కు పెద్దగా ఉపయోగపడలేదు. అయితే దిల్ రాజు నిర్మాణంలో అనుపమ ,ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమాకు సైన్ చేసింది. ప్రస్తుతం ఆమె చేతిలో ఈ ఒక్క సినిమానే వుంది.